Gut health : మీ గట్​ హెల్త్​ దెబ్బతింటే కనిపించే లక్షణాలు ఇవి! ఇలా చేస్తే ‘రీసెట్’..

మన శరీర రోగనిరోధక శక్తి, జీర్ణక్రియతో పాటు మానసిక ఆరోగ్యం కూడా గట్​ హెల్త్​పైనే ఆధారపడి ఉంటుంది. పొట్టలో హానికర బ్యాక్టీరియా పెరిగినప్పుడు శరీరం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, ‘గట్ రీసెట్’ ద్వారా దాన్ని ఎలా సరిచేసుకోవాలో చూద్దాము..

Published on: May 16, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

జీర్ణ సమస్యలు- కడుపు ఉబ్బరం, గ్యాస్, తరచూ విరేచనాలు కావడం లేదా మలబద్ధకం వంటి సమస్యలు వేధిస్తున్నాయంటే.. మీ పొట్టలోని బ్యాక్టీరియా సమతుల్యత పూర్తిగా దెబ్బతిన్నట్లు అర్థం.
expand-iconView Photos in a new improved layout
Published on May 16, 2026 11:18 AM

2/9

ఆహారం అరగకపోవడం- పొట్ట ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. దీనివల్ల కడుపులో అసౌకర్యం, ఎలర్జీలు వస్తాయి.

3/9

నిద్రలేమి- పొట్ట ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అది నిద్రపట్టకపోవడానికి, తీవ్రమైన అలసటకు దారితీస్తుంది. ఎందుకంటే నిద్రను నియంత్రించే మెలటోనిన్, మూడ్‌ని మార్చే సెరటోనిన్ హార్మోన్ల ఉత్పత్తి పొట్టలోనే జరుగుతుంది. అక్కడ సమతుల్యత దెబ్బతింటే నిద్ర కూడా దూరమవుతుంది.

4/9

చర్మ సమస్యలు- ఎగ్జిమా, మొటిమలు, రొసేసియా వంటి చర్మ సమస్యలు పొట్టలో వచ్చే తేడాల వల్లే ఎక్కువవుతాయి. పొట్టలోని ఇన్​ఫ్లమేషన్ చర్మంపై కురుపులు, రాషెస్ రూపంలో బయటపడుతుంది.

5/9

వీటితో పాటు మూడ్ స్వింగ్స్, ఇమ్యూనిటీ సమస్యలు, తరచూ అనారోగ్యానికి గురవుతుండటం వంటివి కూడా బ్యాడ్​ గట్​ హెల్త్​కి సంకేతాలని గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి?

6/9

గట్​ రీసెట్- మీ పొట్టలోని బ్యాక్టీరియాను మళ్లీ సమతుల్యతలోకి తీసుకురావడానికి చేసే 3 నుంచి 7 రోజుల ఒక షార్ట్-టర్మ్ డైట్, లైఫ్‌స్టైల్ ప్లాన్​ని గట్​ రీసెట్​ అనొచ్చు.

7/9

స్టెప్​ 1- హానికర బ్యాక్టీరియాను అంతం చేయడం కోసం యాడెడ్​ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (ప్యాకెట్ ఫుడ్స్), ఆల్కహాల్, మితిమీరిన కెఫిన్ (కాఫీ/టీ), పెయిన్ కిల్లర్ మాత్రలను వాడటం పూర్తిగా తగ్గించాలి.

8/9

స్టెప్​ 2- వెల్లుల్లి, ఉల్లిపాయలు, అరటిపండ్లు వంటివి పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడతాయి. కెఫిర్, కిమ్చి, సౌర్‌క్రాట్, కొంబుచా వంటి ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. మజ్జిగ కూడా ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. బెర్రీలు, గ్రీన్ టీ, ముదురు ఆకుకూరలు పొట్టలోని ఇన్​ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

9/9

స్టెప్​ 3- రోజుకు 7 నుండి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. నిద్ర లేకపోతే పొట్టలోని బ్యాక్టీరియా వేగంగా నశిస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు సాధారణంగా నడవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడదు.

Related Photos