Smriti Mandhana : రికార్డుల రారాణి స్మృతి మంధాన! టీ20ల్లో అత్యధిక పరుగులు..

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్‌ను దాటి మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

Published on: Sept 20, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించింది. జపాన్‌ నిషిన్‌లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో 8 పరుగుల మార్కును దాటడం ద్వారా మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Sept 20, 2026 11:20 AM

2/5

తన 178వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న 30 ఏళ్ల మంధాన, న్యూజిలాండ్ లెజెండ్ సూజీ బేట్స్ (4,758 పరుగులు) పేరిట ఉన్న ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ఆరంభం నుంచే నిలకడైన ప్రదర్శనతో భారత జట్టుకు అనేక విజయాలు అందించిన స్మృతి, ఇప్పుడు ప్రపంచ టీ20 క్రికెట్‌ శిఖరాగ్రాన నిలిచింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 4,287 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ (3,817 పరుగులు), ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ (3,783 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
(PTI)expand-iconView Photos in a new improved layout

(PTI)

3/5

ఇక ఆసియా గేమ్స్​లోని ఈ హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. క్వార్టర్ ఫైనల్లో జపాన్‌పై విజయం సాధించిన తుది జట్టునే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు కూడా కొనసాగించింది. జపాన్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో భారత్ 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో స్మృతి మంధాన బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం పడలేదు. ఈ సెమీఫైనల్లో ఆరంభం నుంచే చురుగ్గా ఆడుతూ జట్టుకు శుభారంభాన్ని అందించడమే కాకుండా వ్యక్తిగతంగా ప్రపంచ రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది మంధాన.

4/5

ఈ సెమీఫైనల్లో విజేతగా నిలిచే జట్టు మంగళవారం జరిగే స్వర్ణ పతక పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఆదివారం ఉదయం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. గత హ్యాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టు, ఈసారి కూడా అదే జోరును కొనసాగించి పసిడి పతకాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. స్మృతి మంధాన అద్భుత ఫామ్ భారత జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది.

5/5

భారత తుది జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, భారతి ఫుల్మాలి, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), గుణలన్ కమలిని, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, నందని శర్మ, క్రాంతి గౌడ్.

బంగ్లాదేశ్ తుది జట్టు: దిలారా అక్తర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగార్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), షొర్నా అక్తర్, షార్మిన్ అక్తర్, షాంజిదా అక్తర్ మేఘ్లా, రాబెయా ఖాన్, నాహిదా అక్తర్, మరూఫా అక్తర్, సుల్తానా ఖాతూన్.

Related Photos