French fries : బంగాళదుంపలతో కాదు.. ఫ్రెంచ్​ ఫ్రైస్​తో షుగర్​ వ్యాధి ముప్పు అధికం!

బంగాళదుంపలు ఎక్కువ తింటే షుగర్ వ్యాధి వస్తుందనే ప్రచారంలో నిజం లేదని బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బీఎంజే) పరిశోధన స్పష్టం చేసింది. అసలు ముప్పు దుంపల్లో లేదు, మనం వండే పద్ధతిలోనే ఉందని, ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు 20 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

Published on: Jun 5, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

పోషకాహార ప్రపంచంలో బంగాళదుంప (ఆలుగడ్డ) స్థానం దశాబ్దాలుగా ఒక పెద్ద వివాదంగానే నడుస్తోంది! కొందరు దీనిని పొటాషియం, ఫైబర్, అవసరమైన విటమిన్లు లభించే చౌకైన వనరుగా అభివర్ణిస్తే.. మరికొందరు మాత్రం ఇందులో ఉండే స్టార్చ్ (పిండిపదార్థం), అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ కారణంగా దీనిని ఒక అనారోగ్యకరమైన ఆహారంగా చూస్తారు. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మనం తినే ఆహారం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో చూపే ఒక కొలమానం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు బంగాళదుంపలతో చేసిన అన్ని రకాల వంటకాలను ఒకే కేటగిరీ కింద చేర్చి, ఇవి జీవక్రియ లోపాలకు కారణమవుతాయని హెచ్చరించాయి. కానీ, ప్రముఖ బ్రిటీష్ మెడికల్ జర్నల్​లో ప్రచురితమైన ఒక సంచలన దీర్ఘకాలిక అధ్యయనం ఈ అపోహలకు పూర్తిగా తెరదించింది. అసలు ముప్పు భూమి కింద పండే ఈ దుంపలో లేదని, మనం దానిని నూనెలో ముంచి దట్టంగా వేయించే (డీప్ ఫ్రై) పద్ధతిలోనే ఉందని ఈ పరిశోధన స్పష్టంగా నిరూపించింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 5, 2026 11:18 AM

2/6

దాదాపు 40 సంవత్సరాల పాటు 2,05,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల ఆరోగ్య వివరాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. రెగ్యులర్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ (తినే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో, బంగాళదుంపలను సాంప్రదాయ పద్ధతిలో ఉడికించి లేదా కాల్చి తిన్న వారిలో ఎలాంటి మధుమేహం ముప్పు కనిపించలేదు. అంటే, జీవక్రియ ఆరోగ్యం అనేది మనం ‘ఏం తింటున్నాం’ అనేదాని కంటే, దానిని ‘ఎలా వండుతున్నాం’ అనేదానిపైనే ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం ప్రపంచానికి చాటిచెప్పింది.

3/6

ఈ ఫలితాలకు రావడానికి పరిశోధకులు అమెరికాలో 1984 నుంచి 2021 వరకు, అంటే దాదాపు 37 ఏళ్ల పాటు జరిగిన మూడు చారిత్రాత్మక అధ్యయనాల డేటాను క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ పరిశోధన ప్రారంభంలో పాల్గొన్నవారంతా ఆరోగ్యకరమైన వైద్య నిపుణులు. వారికి అంతకుముందు ఎలాంటి డయాబెటిస్, గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు లేవు. వీరంతా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి తాము ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే పూర్తి వివరాలతో కూడిన ప్రశ్నావళిని సమర్పించారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో 22,299 మంది పార్టిసిపెంట్స్ టైప్-2 డయాబెటిస్ బారినపడ్డారు. పరిశోధకులు బంగాళదుంపల వినియోగాన్ని ఒకే కేటగిరీగా చూసినప్పుడు.. వారానికి మూడు సార్లు ఆలుగడ్డలు తినే వారిలో డయాబెటిస్ ముప్పు కేవలం 5 శాతం మాత్రమే పెరిగినట్లు గుర్తించారు. కానీ, వండే పద్ధతుల ఆధారంగా డేటాను వేరు చేసి చూసినప్పుడు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

4/6

వండే పద్ధతిని బట్టి మారే ముప్పు: వారానికి మూడు సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఏకంగా 20 శాతం పెరిగింది. అదే వారానికి మూడు సార్లు బంగాళదుంపలను ఉడికించి, బేక్ చేసి లేదా నలిపి తిన్న వారిలో డయాబెటిస్ ముప్పు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

5/6

ఈ భారీ వ్యత్యాసానికి కారణం ఏమిటంటే.. బంగాళదుంపలను నూనెలో డీప్​ ఫ్రై చేయడం వల్ల అవి అనారోగ్యకరమైన కొవ్వులను పీల్చుకుంటాయి. ఇది ఆహార క్యాలరీల సాంద్రతను పెంచడమే కాకుండా, దాని రసాయన నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు కారణమయ్యేది ఈ నూనె వేపుడు ప్రక్రియే తప్ప, బంగాళదుంపలోని సహజ గుణాలు కావని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

6/6

డయాబెటిస్ రాకుండా జాగ్రత్తపడాలనుకునే వారికి ఈ ఫలితాలు ఒక స్పష్టమైన మార్గదర్శినిగా నిలుస్తాయి. వారానికి మూడు సార్లు తీసుకునే బంగాళదుంపల స్థానంలో హోల్ గ్రెయిన్స్ (దంపుడు బియ్యం, గోధుమలు వంటివి) తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ ముప్పు 8 శాతం తగ్గింది. వారానికి మూడు సార్లు తినే ఫ్రెంచ్ ఫ్రైస్ స్థానంలో పాలిష్ చేయని తృణధాన్యాలను రీప్లేస్ చేయడం వల్ల డయాబెటిస్ వచ్చే రేటు ఏకంగా 19 శాతం పడిపోయింది. దీనికి పూర్తి భిన్నంగా.. ఉడికించిన లేదా కాల్చిన బంగాళదుంపల స్థానంలో తెల్లటి అన్నాన్ని తిన్నప్పుడు టైప్-2 డయాబెటిస్ ముప్పు గణనీయంగా పెరిగింది.

Related Photos