In Pics : ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. ఫోటోలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు విజయ్‌కు స్వాగతం పలికారు.

అనంతరం మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను విజయ్‌కి చంద్రబాబు పరిచయం చేశారు.

ఇరువురు సీఎంల మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. తెలుగు గంగ ప్రాజెక్టుపై చర్చించారు. చెన్నై తాగు నీటి అవసరాల కోసం తెలుగు గంగ ద్వారా ఈ ఏడాది 4.08 టీఎంసీల నీటిని ఆంధ్ర ఇచ్చింది.

అయితే తెలుగు గంగ నుంచి నీటి విడుదలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. దీని మీద సాధ్యాసాధ్యాలను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలిస్తుంది.

అలాగే నదుల అనుసంధానంపై చంద్రబాబు, విజయ్ చర్చించారు. ఇప్పటికే దీనిపై కేంద్రంతో చర్చించినట్టుగా కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

అంతకుముందు తమిళనాడు సీఎం విజయ్.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.

E-Paper

