Vijay TVK : ‘విజయ్​ అనే నేను’.. తమిళనాడు సీఎంగా దళపతి! నెట్​ వర్త్​ ఎంతో తెలుసా?

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం! సోమవారం కొనసాగుతున్న కౌంటింగ్​లో దళపతి విజయ్​కి చెందిన టీవీకే పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తారుమారు చేస్తూ విజయ్​ పార్టీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్​ నెట్​ వర్త్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: May 4, 2026 11:27 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్​ సమయంలో విజయ్​ సమర్పించిన నామినేషన్ ప్రకారం.. ఆయనకు రూ. 404.58 కోట్ల చరాస్తులు ఉన్నాయి.ఇందులో 883 గ్రాముల బంగారం, 5 కార్లు, ఒక టూ-వీలర్ ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on May 4, 2026 11:27 AM

2/5

విజయ్​ స్థిరాస్తుల విలువ రూ. 220.15 కోట్లు. భార్య సంగీతకు రూ. 15.51 కోట్ల చరాస్తులు (3,132 గ్రాముల బంగారం, 134.91 క్యారెట్ల వజ్రాలు), రూ. 2.5 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక విజయ్ వద్ద రూ. 2 లక్షలు, సంగీత వద్ద రూ. 1 లక్ష నగదు ఉంది.

3/5

విజయ్ తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఇచ్చిన రుణాల వివరాలను కూడా అఫిడవిట్​లో వెల్లడించారు. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు. తల్లి శోభకు రూ. 87.12 లక్షలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక భార్య సంగీతకు రూ. 12.6 కోట్లు. కుమారుడు జేసన్ సంజయ్‌కు రూ. 8.78 లక్షలు, కుమార్తె దివ్య సాషాకు రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు వివరించారు.

4/5

ఫిబ్రవరి 2024లో రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్, తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం రెండింటిలోనూ లీడింగ్​లో ఉన్నారు.

5/5

తమిళనాడులో మొత్తం 234 సీట్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 సీట్లలో గెలవాలి. ఉదయం 11 గంటల 20 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్​ ప్రకారం.. దళపతి విజయ్​కి చెందిన టీవీకే పార్టీ 105+ సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. అధికార డీఎంకే 50 సీట్లకే పరిమితమైంది. అన్నాడీఎంకే 75 స్థానాల్లో ముందంజలో ఉంది. మరి తమిళనాడు ప్రజలు విజయ్​కి పూర్తి మద్దతిచ్చారా? లేక హంగ్​ ఏర్పడే అవకాశం ఉందా? అదే జరిగితే అతిపెద్ద పార్టీగా అవతరించే టీవీకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

Related Photos