తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 - మీ గ్రామ ఓటర్ లిస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. అయితే ఓటర్ ముసాయిదా జాబితాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి…..
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుంది.
అయితే ఓటర్ ముసాయిదా జాబితా కోసం చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. అయితే చాలా సింపుల్ గా ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి….
ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ https://finalgprolls.tsec.gov.in/gpwardwisevoterlistrural1.do లోకి వెళ్లాలి, ఇందులో ముందుగా జిల్లా, మండలం, గ్రామపంచాయతీ ఎంచుకోవాలి. అక్కడ కనిపించే కోడ్ ను సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వార్డ్ వైజ్ డేటాపై క్లిక్ చేస్తే సంబంధిత ఓటర్ లిస్ట్ డిస్ ప్లే అవుతుంది.
మరోవైపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. 3వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
డిసెంబర్ 14వ తేదీన ఈ రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు.డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రంలో పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది.
E-Paper

