TG Inter SSC Exams 2026 : తెలంగాణ ఇంటర్, టెన్త్ పరీక్షలు - విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్
నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు మార్చి 14 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ కూడా షురూ అవుతాయి. అయితే ఈసారి విద్యార్థులకు 5 నిమిషాలు ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఇవ్వనున్నారు.ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు మార్చి 14 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ కూడా షురూ అవుతాయి. అయితే ఈసారి విద్యార్థులకు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఇంటర్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు మంగళవారం కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇవ్వాలని తెలిపారు.
ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4.89 లక్షలకు పైగా, రెండవ సంవత్సరం విద్యార్థులు 4.53 లక్షల మందికిపైగా పరీక్షలు రాయనున్నారు. SSC విద్యార్థులు 5.28 లక్షల మంది హాజరుకానున్నారు. అయితే అన్ని కేంద్రాలలో CCTV, పోలీసు బందోబస్తు, ANMలు, ప్రథమ చికిత్స, బెంచీలు మరియు క్లాక్ రూములు ఉంటాయని సీఎస్ వెల్లడించారు.
టెన్త్ ఎగ్జామ్స్ పరీక్షా పత్రాలపై QR కోడ్‌లు ఉంటాయి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు తెరవబడతాయి. హాల్ టిక్కెట్లు విద్యార్థులకు నేరుగా వాట్సాప్ ద్వారా పంపబడతాయని… వెబ్‌సైట్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సీఎస్ వెల్లడించారు.
ఇంటర్ పరీక్షలకు 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు.అన్నిచోట్లా సీసీ కెమెరాలు సెట్ చేశారు. అలాగే మాస్ కాపీయింగ్ జరిగే ఛాన్స్ లేకుండా.. ఈసారి కూడా జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు.
E-Paper

