TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శుభవార్త - రూ.230 కే సిమెంట్ బస్తా!

Published on Aug 18, 2026 06:47 pm IST

Telangana Indiramma Housing Scheme Updates : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ బస్తాను రూ.230కే అందించేందుకు తయారీదారులు సమ్మతించారు. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

1 / 6

తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పారిశ్రామిక రంగా నుంచి సాయం లభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఖర్చును తగ్గించే క్రమంలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి.

expand-icon View Photos in a new improved layout
Published on Aug 18, 2026 06:47 pm IST

తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పారిశ్రామిక రంగా నుంచి సాయం లభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఖర్చును తగ్గించే క్రమంలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి.

2 / 6

మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సిమెంట్ సంస్థలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్కో సిమెంట్ బస్తాను కేవలం రూ.230 కే సరఫరా చేసేందుకు అంగీకరించాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Aug 18, 2026 06:47 pm IST

మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సిమెంట్ సంస్థలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్కో సిమెంట్ బస్తాను కేవలం రూ.230 కే సరఫరా చేసేందుకు అంగీకరించాయి.

3 / 6

మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు, యాజమాన్యాలతో మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఒక గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత మరియు ఆత్మగౌరవాన్ని కల్పించే ఒక బృహత్తర యజ్ఞం," అని స్పష్టం చేశారు. ఈ పవిత్రమైన యజ్ఞంలో సిమెంట్ పరిశ్రమలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

expand-icon View Photos in a new improved layout
Published on Aug 18, 2026 06:47 pm IST

మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు, యాజమాన్యాలతో మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఒక గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత మరియు ఆత్మగౌరవాన్ని కల్పించే ఒక బృహత్తర యజ్ఞం," అని స్పష్టం చేశారు. ఈ పవిత్రమైన యజ్ఞంలో సిమెంట్ పరిశ్రమలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

4 / 6

రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) మొదటి విడత కింద 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతోందని, వీటిలో ఇప్పటికే 85 శాతం ఇళ్లకు సంబంధించి శ్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు.
expand-icon View Photos in a new improved layout
Published on Aug 18, 2026 06:47 pm IST

రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) మొదటి విడత కింద 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతోందని, వీటిలో ఇప్పటికే 85 శాతం ఇళ్లకు సంబంధించి శ్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు.

5 / 6

దీనికి తోడు…. రెండో విడత కింద ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే 'క్యూఆర్' పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు.
expand-icon View Photos in a new improved layout
Published on Aug 18, 2026 06:47 pm IST

దీనికి తోడు…. రెండో విడత కింద ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే 'క్యూఆర్' పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు.

6 / 6

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో, రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. "ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం పారదర్శకంగా విడతల వారీగా నిధులను నేరుగా విడుదల చేస్తున్నాం," అని చెప్పారు.

expand-icon View Photos in a new improved layout
Published on Aug 18, 2026 06:47 pm IST

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో, రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. "ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం పారదర్శకంగా విడతల వారీగా నిధులను నేరుగా విడుదల చేస్తున్నాం," అని చెప్పారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!