TG Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాల రిలీజ్ డేట్ ఫిక్స్...? మార్కులు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?
Telangana Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఒకటి రెడు రోజుల్లోనే ఫలితాలను విడుల చేసే అవకాశం ఉంది.ఒకే రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్, ఒకేషనల్ కోర్సుల ఫలితాలను విడుదల చేస్తారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం…. ఏప్రిల్ 12 లేదా 13వ తేదీన ఫలితాలను ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
శనివారం నాటికి అన్నీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది జరిగిన ఇంటర్ పరీక్షల కోసం దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయింది.
ఫలితాల ప్రాసెస్ తో పాటు ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కూడా శనివారం(ఏప్రిల్ 11) నాటికి పూర్తి చేయనున్నారు. ఆపై సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.
ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని తెలంగాణ విద్యాశాఖ ఓ ప్రకటన ద్వారా కోరింది. సామాజిక మాధ్యమాలలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
ఈ సంవత్సరం పరీక్షలకు దాదాపు 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా బోర్డు అధికారిక పోర్టల్ (tgbie.cgg.gov.in) లో ఫలితాలను పొందవచ్చు.
గతంలో మాదిరిగానే ఈ ఏడాదికి సంబంధించిన ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/telugu ) లో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల వ్యవధిలోనే రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి.
E-Paper

