Telangana Rains : తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ - ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

Telangana weather Report : తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. హైదరాబాద్ కు వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలను జారీ చేసింది.

Published on: Jun 10, 2026 10:19 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలంగాణకు వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన  వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.

expand-iconView Photos in a new improved layout
Published on Jun 10, 2026 10:19 AM

2/6

ఇవాళ(జూన్ 10) వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే వీలుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

3/6

జూన్ 11 నుంచి 12వ తేదీల మధ్య కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు (గంటకు 40-50 కి.మీ వేగం), ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, జూన్ 12 తర్వాత కొన్ని చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

4/6

రాజధాని హైదరాబాద్ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. నగరం మరియు పరిసర ప్రాంతాలలో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం మెండుగా ఉంది. కొన్ని చోట్ల గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చు.

5/6

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం…. నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ తెలంగాణ - హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయే అవకాశం ఉంది. కనీసం జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపు ముందుకు కదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయి

6/6

ఇక జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది, ఫలితంగా జూన్ 19-23 మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో రుతుపవన గమనంలో వేగం పెరగనుంది.

Related Photos