మిస్ వరల్డ్ - 2025 ‘ఓపల్ సుచాత’ కు భారీ ప్రైజ్ మనీ… ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ వరల్డ్‌గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.
ఓపల్ సుచాత సువాంగ్ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో(2003) జన్మించారు. ఈమె గతంలో మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 కిరీటాన్ని గెలుచుకున్నారు. అంతేకాకుండా మిస్ యూనివర్స్ 2024 పోటీలో థాయిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లో మూడవ ప్లేస్ లో నిలిచారు. తాజాగా జరిగిన మిస్ వరల్ట్ 2025 పోటీల్లో గెలిచి… ప్రపంచ సుందరీగా నిలిచారు.
72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ విజేతగా నిలిచారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వ సాకారంతో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొనేందుకు సుమారు 108కి పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలివచ్చారు. వీరిలో థాయిలాండ్ కు చెందిన సుందరీమణి విజేతగా నిలిచింది. దీంతో ఆమె 72వ మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు.
మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన ఓపల్ సుచాతకు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 8.5 కోట్ల రూపాయలు. ఈ ప్రైజ్ మనీని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో పాటు ప్రధాన స్పాన్సర్ల ద్వారా లభిస్తుంది.
మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన ఓపల్ సుచాతకు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 8.5 కోట్ల రూపాయలు. ఈ ప్రైజ్ మనీని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో పాటు ప్రధాన స్పాన్సర్ల ద్వారా లభిస్తుంది.
మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా…. సుచాతా చువాంగ్‌కు కిరీటాన్ని ధరించారు. ఇక ఈ పోటీల్లో మొదటి రన్నర్ అప్‌గా ఇథియోపియా నిలిచారు.
E-Paper

