ఆరోగ్య సమస్యలను ఆన్​లైన్​లో సెర్చ్ చేస్తున్నారా? ‘గూగుల్ డాక్టర్’ని నమ్మితే ప్రమాదమే!

గర్భధారణ లక్షణాల నుంచి నవజాత శిశువుల సంరక్షణ వరకు నేటి తల్లిదండ్రులు డాక్టర్ కంటే ముందే ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ 'గూగుల్ డాక్టర్ ఎఫెక్ట్' వల్ల కలిగే అనర్థాలు, స్వీయ వైద్యంతో పొంచి ఉన్న ప్రమాదాలపై నిపుణుల హెచ్చరికలు ఇక్కడ చదవండి.

Published on: Nov 14, 2026 4:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

గర్భధారణ సమయంలో చిన్నపాటి నలత కనిపించినా, అప్పుడే పుట్టిన పసికందు ఏడ్చినా నేటి తల్లిదండ్రుల చేతులు వెంటనే స్మార్ట్‌ఫోన్ వైపు వెళ్తున్నాయి. వైద్యుడిని సంప్రదించే ముందే గూగుల్‌లో వెతకడం, యూట్యూబ్ వీడియోలు చూడటం పరిపాటిగా మారింది. ఆన్‌లైన్ సమాచారం వల్ల కొంత అవగాహన పెరుగుతున్నప్పటికీ, తప్పుడు సమాచారం, సొంత వైద్యం, అనవసరపు ఆందోళనలు కీలకమైన ఆరోగ్య నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు పట్టణాల్లోని యువ దంపతుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, పక్కనే ఉండి సలహాలు ఇచ్చే పెద్దలు లేకపోవడంతో చాలామంది ఇంటర్నెట్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ గ్రూపులనే నమ్ముకుంటున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం, శిశు సంరక్షణ వరకు ప్రతి దశలోనూ ఎన్నో సందేహాలు, భయాలు తలెత్తుతాయి. వాటికి తక్షణ సమాధానాల కోసం తల్లిదండ్రులు ఆన్‌లైన్ వేదికలను ఆశ్రయిస్తున్నారు.

Published on Nov 14, 2026 4:00 PM

2/6

ఆరోగ్య సమాచారం కోసం ఇంటర్నెట్‌పై ఇలా విపరీతంగా ఆధారపడటాన్ని వైద్య పరిభాషలో ‘గూగుల్ డాక్టర్ ఎఫెక్ట్’ అని పిలుస్తారు. డిజిటల్ వేదికలు సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తెచ్చినా, తమ శరీర తత్వానికి అది సరిపోతుందో లేదో తెలుసుకోకుండానే సొంత వైద్యం చేసుకునే ప్రమాదాన్ని పెంచాయి. "ఒక్కసారి సెర్చ్ చేస్తే చాలు, కొన్ని సెకన్లలోనే వేలాది కథనాలు, వీడియోలు, ఇతరుల వ్యక్తిగత అనుభవాలు, వైద్య సలహాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి," అని పూణే లూల్లానగర్‌లోని మదర్‌హుడ్ హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాఖీ వాఘ్ తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి సమాచారం కచ్చితమైనది కాదని, ధ్రువీకరించని విషయాలను నమ్మడం వల్ల భరోసా కంటే గందరగోళమే ఎక్కువగా ఏర్పడుతుందని ఆమె హెచ్చరించారు.

3/6

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కడుపులో అసౌకర్యం, తలనొప్పి, కాళ్ల వాపులు, వికారం లేదా కడుపులో బిడ్డ కదలికల్లో మార్పులు కనిపించినప్పుడల్లా గర్భిణులు ఇంటర్నెట్‌లో వెతుకుతుంటారు. సాధారణ కారణాల వల్ల వచ్చే లక్షణాలకు కూడా ఇంటర్నెట్‌లో తీవ్రమైన వ్యాధుల పేర్లు కనిపించడంతో లేనిపోని భయాలకు లోనవుతున్నారు. అలాగే కొత్తగా తల్లిదండ్రులైన వారు పసిపిల్లల పాల అలవాట్లు, నిద్ర సమయాలు, చర్మంపై మార్పులు, శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే శబ్దాల గురించి ఆన్‌లైన్‌లో చదివి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా ఈ గందరగోళాన్ని మరింత పెంచుతోంది. కొందరు తమ వ్యక్తిగత అనుభవాలను అందరికీ వర్తించే సాధారణ వైద్య సలహాలుగా ప్రచారం చేస్తున్నారు. ఒక గర్భిణికి లేదా ఒక చిన్నారికి పనిచేసిన చిట్కా మరొకరికి సరిపడకపోవచ్చు అన్న కనీస విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.

4/6

ఆన్‌లైన్ చిట్కాలు, సలహాలను పాటిస్తూ వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేయడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొందరు డాక్టర్ సలహా లేకుండానే సప్లిమెంట్లు వాడటం, వైద్యులు రాసిన మందులను మార్చడం లేదా గర్భధారణ సమయంలో కఠినమైన ఆహార నియమాలు పాటించడం చేస్తున్నారు. మరికొందరు నవజాత శిశువులకు సొంతంగా ఇంటి వైద్యం చేస్తున్నారు. గర్భధారణ అనేది అత్యంత సున్నితమైన సమయం. ఈ దశలో పోషకాహార అవసరాలు, మందుల సురక్షితత్వం, వైద్య అవసరాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. అదేవిధంగా నవజాత శిశువులు, అందులోనూ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం. పిల్లల్లో జ్వరం, పాలు సరిగ్గా తాగకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణ నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తే కేవలం ఇంటర్నెట్ సెర్చ్‌ల ఆధారంగా అంచనా వేయకూడదు.

5/6

ఆరోగ్య సమాచారం కోసం గుర్తింపు పొందిన ఆసుపత్రుల వెబ్‌సైట్లు, ప్రభుత్వ ఆరోగ్య పోర్టల్‌లు, వైద్య సంఘాలు, అర్హత కలిగిన వైద్య నిపుణుల సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. తక్షణ ఫలితాలు ఇస్తామని హామీ ఇచ్చే కంటెంట్, డాక్టర్ రాసిన మందులను ఆపేయమని చెప్పే పోస్టులు, శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యాలు, చిట్కాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ సమాచారం ఎప్పటికీ వైద్యుడి ప్రత్యక్ష పరీక్ష, పాత వైద్య చరిత్ర, రోగనిర్ధారణ పరీక్షలకు ప్రత్యామ్నాయం కాలేదని గుర్తుంచుకోవాలి. సొంతంగా చికిత్స నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా, వైద్యుడిని కలిసినప్పుడు ఏయే సందేహాలు అడగాలో సిద్ధం చేసుకోవడానికి మాత్రమే తల్లిదండ్రులు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలి.

6/6

ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి ఇంటర్నెట్ ఒక చక్కని సాధనం అనడంలో సందేహం లేదు. కానీ ప్రతి గర్భధారణ, ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆన్‌లైన్ సెర్చ్‌ల వల్ల భయపడిపోయే బదులు, తల్లిదండ్రులు తమ సందేహాలను గైనకాలజిస్ట్ లేదా పీడియాట్రిషియన్‌తో బహిరంగంగా చర్చించాలి. విషయాలపై అవగాహన కలిగి ఉండటం ఎంత అవసరమో, ఎక్కడ ఇంటర్నెట్ వెతుకులాట ఆపి నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Related Photos