Paradise Nani : థియేటర్లలో ‘జడల్ జమానా’- ఈ ఓటీటీల్లో ది ప్యారడైజ్ స్టార్ నాని టాప్ 5 సినిమాలు..
ఈ ఏడాది మచ్ అవైటెడ్ టాలీవుడ్ సినిమాల్లో ఒకటైన ది ప్యారడైజ్ సినిమా థియేటర్ల విడుదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా నాని మేనియా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా ఇప్పటివరకు నాని టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ వివరాలను ఇక్కడ చూసేయండి..
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ది ప్యారడైజ్‌కు హైప్ మామూలుగా లేదు. రిలీజ్‌కి ముందే తెలుగు రాష్ట్ర సినీ అభిమానులను ఈ సినిమా ఊపేసింది. అనిరుధ్ మ్యూజిక్ తోడవ్వడంతో బొమ్మ బ్లాక్బాస్టర్ అని అందరు అంచనా వేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓవైపు థియేటర్లలో సందడి చేస్తోంది. మరి మీరు నాని టాప్-5 (కలెక్షన్ల పరంగా) సినిమాలు రీ-వాచ్ చేయాలనుకుంటే.. ఇది మీకోసమే
2025 మేలో విడుదలైన హిట్-3 సినిమా.. ఇప్పటివరకు నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ. 120.4 కోట్లు. హిట్-3 నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
కీర్తి సురేశ్, నాని నటించిన దసరా సినిమా 2023లో విడుదలైంది. ఈ సినిమాని కూడా శ్రీకాంత్ ఓదెలానే తీశాడు. ఇది నాని కెరీర్లో రెండో అతిపెద్ద కలెక్షన్లు రాబట్టిన చిత్రం. దీనికి వరల్డ్ వైడ్ 118.6 కోట్లు వచ్చాయి. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.
2024లో సరిపోదా శనివారం సినిమా విడుదలైంది. ఈ సినిమా డైరక్టర్ వివేక్ ఆత్రేయ. ఇది నాని కెరీర్లో 3వ బిగ్గెస్ట్ హిట్. దీనికి ప్రపంచవ్యాప్తంగా 101.4 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో నాని నటించిన సినిమా ఈగ. 2012లో విడుదలైంది. అప్పట్లో ఇదొక సంచలనం! ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 100.3 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లేదా ఆహాలో చూడవచ్చు.
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న 2023లో విడుదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చేసింది ఈ సినిమా. ఫలితంగా వరల్డ్ వైడ్ రూ. 76.8 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
E-Paper

