Mavigun Viral Photos : ఇదిగో మావిగన్ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, ఓడరేవు.. ఫోటోలు వైరల్
Mavigun Viral Photos : ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాజధాని గురించి మాట్లాడుతూ.. మావిగన్ అయితే బాగుంటుందని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు వచ్చిన సమయంలో వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మావిగన్ అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై రచ్చ రచ్చ అవుతుంది.
MAVIGUN పేరుతో క్యాపిటల్ డిక్లేర్ చేస్తే బాగుండేదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. మచిలీపట్నం టూ విజయవాడ 70 కి.మీ, విజయవాడ టూ గుంటూరు 40 కి.మీ.. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
'ప్లాన్-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు, పట్టించుకోలేదు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. దీని కోసం అమరావతిలో పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ పెట్టినా చాలు.' అని వైఎస్ జగన్ అన్నారు.
దీనిపై వైసీపీ నేతలేమో మావిగన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం మావిగన్ పేరుపై వెటకారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు మావిగన్ ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్, ఓడరేవు అంటూ ఏఐతో ఫోటోలు క్రియేట్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
E-Paper

