తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్ప

Published on Sept 17, 2026 12:02 pm IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. ధైర్యం, పరాక్రమం, తేజస్సుకు ప్రతీకగా సింహ వాహనసేవ చూస్తారు. ఈ వాహన సేవకు సంబంధించిన ఫొటోలు చూడండి.

1 / 6

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
expand-icon View Photos in a new improved layout
Published on Sept 17, 2026 12:02 pm IST

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

2 / 6

వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహనసేవ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగింది.
expand-icon View Photos in a new improved layout
Published on Sept 17, 2026 12:02 pm IST

వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహనసేవ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగింది.

3 / 6

దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు. సింహం పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యం, మహాశక్తికి ప్రతీకగా భావిస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Sept 17, 2026 12:02 pm IST

దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు. సింహం పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యం, మహాశక్తికి ప్రతీకగా భావిస్తారు.

4 / 6

సింహరూప దర్శనం మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, విజయస్ఫూర్తిని మేల్కొలుపుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు సింహ వాహనసేవ స్ఫూర్తినిస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Sept 17, 2026 12:02 pm IST

సింహరూప దర్శనం మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, విజయస్ఫూర్తిని మేల్కొలుపుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు సింహ వాహనసేవ స్ఫూర్తినిస్తుంది.

5 / 6

యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు అభయం, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే మహోన్నత అనుభూతిని కలిగించింది.
expand-icon View Photos in a new improved layout
Published on Sept 17, 2026 12:02 pm IST

యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య దర్శనం భక్తులకు అభయం, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే మహోన్నత అనుభూతిని కలిగించింది.

6 / 6

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Sept 17, 2026 12:02 pm IST

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!