చౌకైన ఆటోమేటిక్ ఎస్‌యూవీలు ఇవి.. ధర రూ. 8.20లక్షల కన్నా తక్కువే!
నగర ట్రాఫిక్‌లో మేన్యువల్ కారు నడిపి నడిపి చిరాకొస్తోందా? ఆటోమేటిక్ కారుకు స్విచ్ అవ్వాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ ధరలో ( ఎక్స్‌షోరూం రూ. 8.20లక్షల లోపు) టాప్-5 ఆటోమేటిక్ ఎస్‌యూవీల లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
రూ. 6.21 లక్షల ఎక్స్‌షోరూం ధరకు భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన ఆటోమేటిక్ ఎస్‌యూవీ ఈ నిస్సాన్ మాగ్నైట్. రెనాల్ట్ కైగర్లాగే ఇందులోనూ ఇంజన్ ఫీచర్లు ఉన్నప్పటికీ, ధర విషయంలో మాగ్నైట్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. దేశంలో అతి తక్కువ ధరకే లభించే సీవీటీ కారు ఇది. ఆల్-బ్లాక్ లుక్ ఇష్టపడేవారి కోసం ఇందులో 'కురో' ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.
రూ. 6.95 లక్షల ఎక్స్‌షోరూం ధర వద్ద టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ కంటే రెనాల్ట్ కైగర్ కాస్త పెద్దదిగా, విశాలంగా ఉంటుంది. ఇందులో రెండు రకాల ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు 5-స్పీడ్ ఏఎంటీ, టర్బో-పెట్రోల్ ఇంజన్‌కు స్మూత్ సీవీటీ గేర్‌బాక్స్ లభిస్తాయి. 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగులు దీని సొంతం.
సేఫ్టీకి మారుపేరుగా నిలిచే టాటా పంచ్ ఏఎంటీ వెర్షన్ మొత్తం రూ. 10 లక్షల బడ్జెట్‌లోనే లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 7.55 లక్షల నుంచి ఉంది. ఇందులో 1.2 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ ఏఎంటీతో వస్తుంది. 10.25 ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్, 16 ఇంచ్ అలాయ్ వీల్స్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ దీని ప్రధాన ఆకర్షణలు.
రూ. 7.68 లక్షల (ఎక్స్‌షోరూం) వద్ద చిన్న కారే అయినప్పటికీ, ఫీచర్ల విషయంలో హ్యుందాయ్ ఎక్స్టర్ రాజీ పడదు. ఇది 1.2 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని ఏఎంటీ వెర్షన్ లీటరుకు 19.2 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ధరలో గేర్లను మాన్యువల్‌గా కంట్రోల్ చేయడానికి ప్యాడిల్ షిఫ్టర్స్ అందించడం విశేషం. నైట్ ఎడిషన్‌లో ఇది మరింత స్టైలిష్‌గా ఉంటుంది.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం రూ. 8.15 లక్షలు. డెల్టా, డెల్టా+ వేరియంట్లు రూ. 10 లక్షల లోపు ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తాయి. మీరు పవర్ ఫుల్ డ్రైవ్ కోరుకుంటే, ఇందులోని 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
E-Paper

