Tirumala Laddu Sales : తిరుమల లడ్డూల విక్రయాల్లో సరికొత్త రికార్డు - జూన్ నెలలో ఏకంగా 1.27 కోట్ల ప్రసాదాలు!

Published on Jul 05, 2026 01:15 pm IST

Tirumala Laddu Sales Record : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక్క నెలలోనే 1.26 కోట్లకు పైగా లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.

1 / 5

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానంతరం భక్తులు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 05, 2026 01:15 pm IST

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానంతరం భక్తులు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

2 / 5

వేసవి సెలవులు మరియు ప్రత్యేక దినాల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరగడంతో.. లడ్డూ ప్రసాదాల విక్రయం ఈ ఏడాది జూన్ నెలలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటనలో వెల్లడించింది. భక్తుల అవసరాలకు అనుగుణంగా టీటీడీ పోటు (లడ్డూ తయారీ కేంద్రం) లో ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఎక్కడా ఎలాంటి కొరత లేకుండా నిరంతరాయంగా ప్రసాదాలను పంపిణీ చేస్తోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 05, 2026 01:15 pm IST

వేసవి సెలవులు మరియు ప్రత్యేక దినాల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరగడంతో.. లడ్డూ ప్రసాదాల విక్రయం ఈ ఏడాది జూన్ నెలలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటనలో వెల్లడించింది. భక్తుల అవసరాలకు అనుగుణంగా టీటీడీ పోటు (లడ్డూ తయారీ కేంద్రం) లో ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఎక్కడా ఎలాంటి కొరత లేకుండా నిరంతరాయంగా ప్రసాదాలను పంపిణీ చేస్తోంది.

3 / 5

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 05, 2026 01:15 pm IST

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

4 / 5

2024 జూన్ నెలలో 1,02,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 05, 2026 01:15 pm IST

2024 జూన్ నెలలో 1,02,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది.

5 / 5

శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుండి తరలివస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దానికి తగ్గట్టుగానే లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, ఇతర ముడిసరుకుల నాణ్యతను కాపాడుతూ, పంపిణీ కౌంటర్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ యాజమాన్యం, అధికారులు సమర్థవంతమైన ముందస్తు ప్రణాళికలతో సేవలందిస్తున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Jul 05, 2026 01:15 pm IST

శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుండి తరలివస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దానికి తగ్గట్టుగానే లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, ఇతర ముడిసరుకుల నాణ్యతను కాపాడుతూ, పంపిణీ కౌంటర్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ యాజమాన్యం, అధికారులు సమర్థవంతమైన ముందస్తు ప్రణాళికలతో సేవలందిస్తున్నారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!