TG Scholarships : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి ఛాన్స్ ఇదే..!
Telangana Scholarships : తెలంగాణలోని బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తులకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చేసింది. అప్లికేషన్ల గడువును ఏప్రిల్ 20వ తే తేదీ వరకు పొడిగించారు.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువుపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థుల కోసం…. ఏప్రిల్ 20, 2026 వరకు తాజాగా గడువు పొడిగించారు.
2025-26 విద్యా సంవత్సరానికి ఫ్రెషర్స్, రెన్యువల్స్ కలిపి మొత్తం 10.91 లక్షల మందిలో.. 9.66 లక్షల మంది మాత్రమే ఈ-పాస్‌లో దరఖాస్తు చేశారు. ఇంకా 87 వేల మంది ఫ్రెషర్స్, 37 వేల మంది రెన్యువల్.. మొత్తం 1.24 లక్షల మంది దరఖాస్తు చేయాల్సి ఉంది. దీనికి గడువు ఈ నెల 31న ముగియనుంది.
మార్చి 31వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించినప్పటికీ… చివరి అవకాశంగా ఏప్రిల్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు.ఇదే చివరి ఛాన్స్ అని అధికారులు స్పష్టం చేశారు.
అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.
కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
రిఫరెన్స్ నెంబర్ తో స్కాలర్ షిప్ స్టేటస్ కూడా చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన డబ్బు వివరాలతో పాటు కాలేజీ ఖాతాలోకి వెళ్లిన వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు.
E-Paper

