విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సీక్రెట్.. ఈ డైట్ ప్లాన్​తో అద్భుతాలు!

భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీకి వయసు పెరుగుతున్నా మైదానంలో కనిపించే ఉత్సాహం మాత్రం తగ్గదు. ఆ ఉత్సాహం వెనుక ఉన్న డైట్ నిబంధనలు, సింపుల్ ఫుడ్ హాబిట్స్, క్రమశిక్షణతో కూడిన ఫిట్‌నెస్ ప్రయాణం వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Updated on: Nov 6, 2026 11:34 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రపంచ క్రికెట్ రంగాన్ని తన అసాధారణ బ్యాటింగ్‌తో ఏలుతున్న భారత దిగ్గజం విరాట్ కోహ్లీ నేడు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వందలాది రికార్డులు తిరగరాసిన కోహ్లీ, మైదానంలో చూపే చురుకుదనంలోనూ, అంకితభావంలోనూ నేటితరం యంగ్ క్రికెటర్లకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచారు. 38 ఏళ్లు వచ్చినా 20 ఏళ్ల యువకుడిలా మైదానంలో పరుగెత్తడం, కళ్లు చెదిరే క్యాచ్‌లను పట్టుకోవడం వెనుక ఆయన అనుసరిస్తున్న అత్యంత కఠినమైన డైట్ నియమాలు, క్రమశిక్షణే కారణం. భారతీయుల్లో చాలా మందికి హెల్తీ లైఫ్‌స్టైల్ ఎంచుకోవడానికి విరాట్ ప్రయాణమే స్ఫూర్తిగా నిలిచింది. కాంప్లికేటెడ్ డైట్లు ఎంచుకోవడం కంటే రోజూ ఒకే రకమైన క్రమశిక్షణ పాటించడమే తన ఫిట్‌నెస్ రహస్యమని కోహ్లీ వెల్లడించారు.

Updated on Nov 6, 2026 11:34 AM

2/5

ఫిట్‌నెస్ ప్రయాణంలో విటమిన్లు, ప్రోటీన్లు, సప్లిమెంట్లు అంటూ పదుల సంఖ్యలో కొత్త విషయాలను ప్రయత్నించడం కంటే మన శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడమే ముఖ్యం. దాన్ని క్రమం తప్పకుండా పునరావృతం చేయడమే అసలైన విజయమని కోహ్లీ స్పష్టం చేశారు. "నా దృష్టిలో ఫిట్‌నెస్‌కు 'లెస్ ఈజ్ మోర్' (తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం) విధానమే సరైనది. శారీరక దారుఢ్యం కోసం ఏవో సప్లిమెంట్లు, విటమిన్లు అని వెతకడం కన్నా, మన శరీరానికి ఏ సమతుల్యత సరిపోతుందో గ్రహించి దాన్ని రోజూ పాటించడమే అసలైన విద్య," అని గతంలో స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.

3/5

కసరత్తులు చేయడం సులభమే అయినా, నాలుక చాపల్యాన్ని నియంత్రించి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టమైన విషయమని కోహ్లీ భావిస్తారు. దేహదారుఢ్యానికి అనుగుణంగా వ్యాయామం చేయడం ఒక ఎత్తైతే, మానసిక రుచులకు దూరంగా ఉండటం మరొక ఎత్తు. "జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తడం ఎవరైనా చేస్తారు. కానీ ఆహారాన్ని నియంత్రించుకోవడమే అందరికీ పెద్ద సవాలు. ఎందుకంటే రుచితో మానసిక కోరికలు ముడిపడి ఉంటాయి. నేను ఒకే రకమైన ఆహారాన్ని ఎలాంటి విసుగు లేకుండా వరుసగా ఆరు నెలల పాటు రోజుకు మూడు సార్లు తినగలను. ఈ శ్రమను చాలా తొందరగానే గ్రహించాను," అని కోహ్లీ తెలిపారు.

4/5

ఆహారంలో మసాలాలు, నూనెలు లేని సరళమైన వంటకాలనే విరాట్ ఎంచుకుంటారు. గత రెండున్నర నెలల కాలంలో తేలికపాటి వేపుడు పదార్థాలను కేవలం మూడు సార్లు మాత్రమే తిన్నానని, డీప్ ఫ్రై చేసిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటానని పేర్కొన్నారు. రోజువారీ తినే ఆహారంలో 90 శాతం వరకు ఆవిరిపై ఉడకబెట్టిన, మరిగించిన వంటకాలకే ప్రాధ్యాన్యం ఇస్తారు. మసాలా కూరలకు దూరంగా ఉంటూ కేవలం నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు మాత్రమే వినియోగిస్తారు. శనగలు, రాజ్మా, లోబియా పప్పు వంటి సాధారణ శాకాహార భోజనానికే తన తొలి ప్రాధాన్యం.

5/5

ఫ్యాన్సీ ఫిట్‌నెస్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించడం కన్నా, సులువైన ఆహార నియమాలను ఎక్కువ కాలం స్థిరంగా పాటించడమే క్రీడాకారుడిగా తన లాంగ్ కెరీర్‌కు పునాది అని విరాట్ కోహ్లీ రుజువు చేశారు.

Related Photos