Aaryavir Sehwag: సెహ్వాగ్ కొడుకా మజాకా! అండర్- 19 ఆసియా కప్‌లో టాప్ స్కోరర్‌గా ఆర్యవీర్- ఇండియా విక్టరీలో కీ రోల్!
Aaryavir Sehwag: వీరేంద్ర సెహ్వాగ్.. ఈ పేరు వింటే టీమిండియా ఓపెనర్ గా ఆయన చేసిన విధ్వంసం కళ్ల ముందు కదులుతుంది. ఫస్ట్ బాల్ కే ఫోర్ కొట్టడం ఆయన స్టైల్. ఇప్పుడు తండ్రి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆర్యవీర్ సెహ్వాగ్ రెచ్చిపోతున్నాడు. అండర్-19 ఆసియా కప్ లో ఇండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.

టీమిండియా క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ ఆటలో అదరగొడుతున్నాడు. తాజాగా అండర్-19 ఆసియా కప్ లో సత్తాచాటాడు.

ఇండియా ఛాంపియన్ గా నిలిచిన అండర్-19 ఆసియా కప్ లో ఆర్యవీర్ సెహ్వాగ్ టాప్ స్కోరర్ గా టాప్ లేపాడు.

ఆర్యవీర్ ఈ అండర్-19 ఆసియా కప్ లో 5 మ్యాచ్ ల్లో 361 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా అవార్డు అందుకున్నాడు.

తండ్రి వీరేంద్రలాగే ఆర్యవీర్ కూడా రైటార్మ్ ఓపెనర్ బ్యాటర్. అతను కూడా దూకుడుగానే ఆడతాడు. అయితే తండ్రిలా కాకుండా విరాట్ కోహ్లిలా ఇన్నింగ్స్ కొనసాగించడం తనకు ఇష్టమని ఆర్యవీర్ చెప్పాడు.

కొన్ని రోజులుగా ఆర్యవీర్ సెహ్వాగ్ పేరు మార్మోగుతూనే ఉంది. ఇప్పుడు అండర్-19 ఆసియా కప్ లో ఇండియా ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో అతని పేరు మళ్లీ వైరల్ అవుతోంది.

E-Paper

