Vitamin C fruits : జామకాయ vs నారింజ్- విటమిన్ సీ కోసం రెండింటిలో ఏది బెస్ట్?

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, చర్మం మెరిసిపోవాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది విటమిన్ సీ. ఈ పోషకం అనగానే మన మైండ్‌లో మెదిలే మొదటి రెండు పండ్లు.. జామకాయ, నారింజ. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎందులో విటమిన్ సీ అధికం? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 27, 2026 11:21 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఇన్ఫెక్షన్ల నుంచి తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికీ బలమైన రోగనిరోధక శక్తి అవసరం. అందుకే విటమిన్ సీ అధికంగా ఉండే పండ్లను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రేసులో నారింజ పండును మనం ‘గో-టు’ ఫ్రూట్‌గా చూస్తాం. కానీ, అసలు నిజాలు తెలిస్తే జామకాయను అస్సలు వదిలిపెట్టరు! ఆరోగ్య నిపుణుల ప్రకారం.. విటమిన్ సీ మన శరీరంలో కేవలం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఇన్ఫెక్షన్లతో వేగంగా పోరాడటానికి, జబ్బుల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. దీనితో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ‘కొల్లాజెన్’ ఉత్పత్తికి, ఎముకల బలానికి, కనెక్టివ్ టిష్యూల నిర్వహణకు విటమిన్ సీ అత్యంత కీలకం.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 27, 2026 11:21 AM

2/5

నారింజ పండు- ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం వంటి పోషకాలు రక్తపోటును నియంత్రించి, గుండెను పటిష్టంగా ఉంచుతాయి. దీన్ని వలుచుకు తినడం చాలా సులువు, ఎక్కడైనా దొరుకుతుంది. రోజువారీ స్నాక్స్‌లో చేర్చుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

3/5

జామకాయ- జామలో పీచుపదార్థం చాలా ఎక్కువ. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణవ్యవస్థను క్లీన్‌గా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను తట్టుకునేలా బాడీని సిద్ధం చేస్తుంది.

4/5

జామ vs నారింజ- నారింజ పండులో దాదాపు 53 ఎంజీ విటమిన్ సీ ఉంటుంది. జామకాయలో 228ఎంజీ విటమిన్ సీ ఉంటుంది. మీరు చదివింది నిజమే! నారింజ పండుతో పోలిస్తే జామకాయలో నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది. సాధారణంగా ఒక రోజుకు మనిషికి కావలసిన విటమిన్ సీ అవసరాన్ని కేవలం ఒకే ఒక్క జామకాయ తీర్చగలదు. అదే స్థాయి విటమిన్ సీ శరీరానికి అందాలంటే మీరు కనీసం 3 నుంచి 4 నారింజ పండ్లను తినాల్సి ఉంటుంది.

5/5

మీరు తక్కువ ఖర్చులో, అతి త్వరగా ఎక్కువ మొత్తంలో విటమిన్ సీ పొందాలి అనుకుంటే మాత్రం జామకాయే నంబర్ వన్ ఛాయిస్. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న రోజుల్లో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగని నారింజను తక్కువ చేయలేం. గుండె ఆరోగ్యం, బాడీ హైడ్రేషన్ పరంగా నారింజ ఇచ్చే ప్రయోజనాలు దానివే. అందుకే, రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవడం కంటే.. సీజన్‌ను బట్టి మీ రోజువారీ ఆహారంలో జామకాయ, నారింజ రెండింటినీ భాగం చేసుకోవడమే ఆరోగ్యానికి అత్యంత ఉత్తమమైన మార్గం.

Related Photos