అనలాగ్ పన్నీర్ వర్సెస్ ఫ్రెష్ పన్నీర్- తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది?

Analogue Paneer : అసలైన పన్నీర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఖర్చులు తగ్గించేందుకు తయారుచేసే అనలాగ్ పన్నీర్‌లో నూనెలు, కెమికల్స్ వాడతారు. ఈ నేపథ్యంలో తాజా పన్నీర్​కి అనలాగ్ పన్నీర్​కి మధ్య మధ్య తేడాలు, అనలాగ్ పన్నీర్​తో ఆరోగ్య ప్రభావాల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 8, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

అసలైన పన్నీర్, అనలాగ్ పన్నీర్ మధ్య ప్రధాన వ్యత్యాసం అవి తయారయ్యే పదార్థాలే. స్వచ్ఛమైన ఆవు పాలు లేదా పూర్తి కొవ్వు ఉన్న పాలను మరిగించి, విడదీయడం ద్వారా తాజా పన్నీర్‌ను తయారు చేస్తారు. ఇందులో శరీగానికి కావాల్సిన ప్రొటీన్లు, సహజసిద్ధమైన కొవ్వులు ఉంటాయి. మరోవైపు, అనలాగ్ పన్నీర్‌ను మిల్క్ పౌడర్, వెజిటెబుల్ ఫ్యాట్స్ (కూరగాయల నూనెలు), స్టార్చ్, ఎమల్సిఫైయర్లతో తక్కువ ఖర్చుతో కృత్రిమంగా తయారు చేస్తారు.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 8, 2026 11:20 AM

2/6

తాజా పన్నీర్‌లో పాలలోని వే- కేసిన్ ప్రొటీన్లు ఉండటం వల్ల ప్రొటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శాఖాహారులకు అత్యుత్తమ ప్రొటీన్ మూలకం. కానీ అనలాగ్ పన్నీర్‌లో ఉపయోగించే పదార్థాల నాణ్యతను బట్టి ప్రొటీన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని దీర్ఘకాలం పాటు తింటే అనారోగ్య సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంది.

3/6

స్వచ్ఛమైన పన్నీర్‌లో సహజమైన మిల్క్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అనలాగ్ పన్నీర్‌లో పామ్ ఆయిల్ వంటి హానికరమైన పదార్థాలను వాడుతారు. ఇది గుండె జబ్బులకు దారితీస్తుందని 'వరల్డ్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ' హెచ్చరిస్తోంది. అంతేకాదు, పామ్ ఆయిల్ వాడకం పర్యావరణానికి కూడా నష్టమే.

4/6

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదికల ప్రకారం.. అనలాగ్ పన్నీర్ పోషక విలువలు ఇలా ఉంటాయి: కేలరీలు: ప్రతి 100 గ్రాములకు 260-320 కేలరీల కంటే ఎక్కువ, ప్రొటీన్: ప్రతి 100 గ్రాములకు 18-21 గ్రాముల కంటే తక్కువ, కొవ్వు (ఫ్యాట్): 20-25 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ, సోడియం: ఎమల్సిఫైయింగ్ సాల్ట్స్ కారణంగా సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

5/6

అనలాగ్ పన్నీర్ వల్ల ఆరోగ్య సమస్యలు- ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి, షెల్ఫ్ లైఫ్ పెంచడానికి దీన్ని తయారు చేస్తారు. కానీ దీనివల్ల అనారోగ్య ముప్పు పొంచి ఉంది. తయారీలో వాడే వెజిటెబుల్ ఫ్యాట్ నాణ్యత లేకపోవడం వల్ల ఇది ఆరోగ్యానికి హానికరం. సోడియం మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల హైపర్ టెన్షన్, రక్తపోటు ఉన్నవారికి ప్రమాదకరం. పోషకాలు లోపించడం వల్ల ఇది శరీరానికి ఎలాంటి పోషణను అందించదు.

6/6

అనలాగ్ పన్నీర్‌ను గుర్తించడం ఎలా?-  షాపింగ్ చేసేటప్పుడు ప్యాకెట్​పై ఉన్న ఇంగ్రిడియంట్ లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవాలి. వంటనూనెలు, ఎమల్సిఫైయర్లు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. తాజా పన్నీర్ మీద ఒత్తిడి పెడితే సులభంగా విరిగిపోతుంది. కానీ అనలాగ్ పన్నీర్ తన ఆకారాన్ని కోల్పోకుండా గట్టిగా ఉంటుంది. కల్తీని నివారించడానికి ఎప్పుడైనా నమ్మకమైన బ్రాండ్లు, ప్రముఖ వెండర్ల వద్దే కొనుగోలు చేయడం మంచిది.

Related Photos