Stock Market : యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఉన్నదంతా అమ్మేయాలా?

Stock Market crash : ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య అనిశ్చితి కారణంగా మార్చ్​ 9న దేశీయ స్టాక్​ మార్కెట్​ క్రాష్​ అయ్యింది. మార్కెట్​లో పానిక్​ సెల్లింగ్​ కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఉన్నదంతా అమ్మేయాలా? లేక ఇంకా కొనాలా? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 9, 2026 10:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పానిక్​ సెల్లింగ్​కి దూరంగా ఉండండి- మార్కెట్ పడిపోతున్నప్పుడు భయంతో షేర్లను విక్రయించడం ఇన్వెస్టర్లు చేసే అతిపెద్ద తప్పు. యుద్ధం అనేది తాత్కాలిక భౌగోళిక రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తుంది కానీ కంపెనీల ఫండమెంటల్స్​ని రాత్రికి రాత్రే మార్చలేదు. మీ వద్ద నాణ్యమైన బ్లూ-చిప్ షేర్లు ఉంటే, వాటిని విక్రయించకుండా ఓపిక పట్టడమే శ్రేయస్కరం.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 9, 2026 10:45 AM

2/5

పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​- అస్థిరమైన సమయాల్లో బంగారం ఎప్పుడూ ‘సేఫ్​ హెవెన్​’. మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం 10-15% వాటాను బంగారం లేదా గోల్డ్ ఈటీఎఫ్​లలో ఉంచడం వల్ల, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు వచ్చే నష్టాన్ని ఇవి కొంత వరకు భర్తీ చేస్తాయి. అలాగే, డిఫెన్స్ (రక్షణ రంగం), ఫార్మా రంగాలు యుద్ధ సమయాల్లో నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది.

3/5

క్యాష్​ ఇన్​ హ్యాండ్​- మార్కెట్ తీవ్రంగా పడిపోయినప్పుడు అది మంచి బయ్యింగ్​ అవకాశం అవుతుంది. కాబట్టి, మీ వద్ద కొంత నగదును సిద్ధంగా ఉంచుకోవాలి. నాణ్యమైన షేర్లు తక్కువ ధరకు లభిస్తున్నప్పుడు, సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడిని పెంచుకోవాలి. ఒకేసారి మొత్తం సొమ్మును ఇన్వెస్ట్ చేయకుండా విడతల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమం.

4/5

క్రూడ్​ ఆయిల్​ ప్రభావం- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లు దాటడం మనం చూస్తున్నాం. దీనివల్ల పెయింట్, టైర్, ఏవియేషన్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉన్న కంపెనీల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా వాటి లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో చమురు ధరల పెరుగుదల వల్ల లాభపడే రంగాలపై (ఉదాహరణకు ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీలు) దృష్టి సారించాలి. షార్ట్​ టర్మ్​లో గెయిన్స్​ ఇచ్చే అవకాశం ఉంటుంది.

5/5

యుద్ధాలు మార్కెట్లకు షార్ట్-టర్మ్ పెయిన్ (తాత్కాలిక నొప్పి) ఇస్తాయి కానీ లాంగ్-టర్మ్ గేమ్ (సుదీర్ఘ ప్రయాణం)లో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పునాదులు బలంగా ఉంటాయి. యుద్ధ వార్తలను చూసి విశ్లేషణ లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆర్థిక లక్ష్యాలను గుర్తుంచుకుని, నిపుణుల సలహాతో ముందడుగు వేయండి,

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు మీరు మీ సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Related Photos