ఫ్రైడ్ ఫుడ్స్ చూస్తే నోరు ఎందుకు ఆగదు? సైన్స్ ఇదే! కానీ అనేక ఆరోగ్య సమస్యలు కూడా..

ఫ్రైడ్ ఫుడ్స్ నోరూరించడానికి కేవలం క్రేవింగ్స్ కారణం కాదు; నూనెలో వేయించినప్పుడు జరిగే రసాయన మార్పులు, మెదడులోని డోపమైన్ వ్యవస్థే కారణం. అయితే వీటిని తరచూ తింటే మధుమేహం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతుందని హార్వర్డ్ పరిశోధన హెచ్చరిస్తోంది.

Published on: Jul 27, 2026 12:19 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు కనిపించగానే తినాలనే బలమైన కోరిక కలగడం వెనుక పెద్ద సైన్స్ దాగి ఉంది! మన మనస్సును నియంత్రించుకోలేకపోవడమే దీనికి కారణమని అనుకుంటే పొరపాటే. మనం పెంచుకున్న అలవాట్లు, ఆహారాన్ని వండే విధానం, మెదడులోని రసాయన మార్పులు కలసి ఈ క్రేవింగ్స్‌ను కలిగిస్తున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 27, 2026 12:19 PM

2/6

వేడి నూనెలో వేయించినప్పుడు ఆహారంలో భారీ మార్పులు జరుగుతాయి. సావోపాలో విశ్వవిద్యాలయ పరిశోధనల ప్రకారం.. ఆహారాన్ని నూనెలో డీప్‌ఫ్రై చేసినప్పుడు అందులోని నీటిశాతం పూర్తిగా ఆవిరైపోయి పైపొర కరకరలాడుతూ తయారవుతుంది. ఇదే సమయంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు రూపాంతరం చెందుతాయి. ‘మైలార్డ్ రియాక్షన్’ అనే ప్రక్రియ ద్వారా ఆహారానికి ఆకర్షణీయమైన బంగారు రంగు, రుచి, సువాసన వస్తాయి. ఉడకబెట్టిన లేదా పచ్చిగా ఉన్న పదార్థాలతో పోలిస్తే, ఫ్రై చేసిన ఆహారం టెక్స్​చర్, వాసన, రుచి పరంగా నోరూరించేలా మారడానికి ఈ రసాయనిక చర్యే ప్రధాన కారణం.

3/6

మనం ఇష్టపడే ఆహారాన్ని తిన్నప్పుడు మెదడులోని ‘డోపమైన్’ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. డోపమైన్ అనేది కేవలం సంతోషాన్నిచ్చే రసాయనం మాత్రమే కాదు; అది ఆ అనుభవాన్ని మెదడు గుర్తుంచుకునేలా చేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఆ ఆహారాన్ని తినాలనే బలమైన కోరిక పుడుతుంది. అందుకే కడుపు నిండి ఉన్నప్పటికీ, సమోసాలు లేదా ఫ్రైస్ వాసన చూడగానే తినాలనిపిస్తుంది. అయితే, ఫ్రైడ్ ఫుడ్ తినాలనిపించడం అంటే శరీరంలో ఏదో ఒక పోషకం తగ్గిందని అర్థం కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం మనం అలవర్చుకున్న అలవాట్లు, భావోద్వేగాలు, ఆహార వాసనలు లేదా పాత అనుభవాల వల్ల కలిగే ప్రతిస్పందన మాత్రమే అని చెబుతున్నారు.

4/6

ఎప్పుడో ఒకసారి వేపుళ్లు తినడం వల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదు. కానీ వాటిని రోజూ లేదా తరచూ తినడమే అసలు సమస్య. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన డాక్టర్ లీహ్ కాహిల్ నేతృత్వంలో సాగిన ఒక సమగ్ర అధ్యయనం ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. దాదాపు 1,10,000 మందికి పైగా పెద్దలపై రెండు దశాబ్దాల పాటు ఈ పరిశోధన నిర్వహించారు. వారానికి ఏడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఫ్రైడ్ ఫుడ్స్ తినేవారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని, అలాగే గుండె సంబంధిత వ్యాధులు (కోరోనరీ ఆర్టరీ డిసీజ్) వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు.

5/6

అతిగా ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీర బరువు పెరగడం, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ పెరగడమే ఈ ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలని వారు వివరించారు.

6/6

నూనె పదార్థాలను జీవితంలో ఎప్పటికీ తినకూడదని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వీటిపై నియంత్రణ సాధించవచ్చు. సరిగ్గా తినకపోతే వచ్చే తీవ్రమైన ఆకలి వల్ల ఫ్రైడ్ ఫుడ్స్‌పై కోరిక రెట్టింపు అవుతుంది. అందుకే క్రమం తప్పకుండా భోజనం చేయాలి. కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదని కఠినంగా నిషేధించుకుంటే, వాటిపై వ్యామోహం మరింత పెరుగుతుంది. పోషకాలతో కూడిన ఆహారాన్ని తింటూ, అప్పుడప్పుడు పరిమితంగా ఫ్రైడ్ ఫుడ్స్ ఆస్వాదించడమే సరైన పద్ధతి.

Related Photos