SRH vs CSK : ఓడిపోయినా.. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్లిన సీఎస్కే! ఎలా సాధ్యం?
Yesterday IPL match : ఐపీఎల్ 2026లో అరుదైన ఘటన! శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ స్థానం మెరుగుపడింది. ఇది ఎలా సాధ్యమైంది? కారణం ఇదే..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన పోరులో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే, ఈ ఓటమి తర్వాత కూడా ఆ జట్టు ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్లడం గమనార్హం. మ్యాచ్‌కు ముందు ఎనిమిదో స్థానంలో ఉన్న చెన్నై, ఓడిపోయిన తర్వాత ఏడో స్థానానికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
(AP)
ఈ వింత పరిణామానికి ప్రధాన కారణం నెట్ రన్‌రేట్. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీఎస్కే నాలుగు పాయింట్లతో, -0.846 నెట్ రన్ రేట్‌తో ఎనిమిదో స్థానంలో ఉంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై భారీ తేడాతో కాకుండా, కేవలం 10 పరుగుల స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. దీనితో జట్టు నెట్ రన్‌రేట్ -0.846 నుంచి -0.780కి మెరుగుపడింది.
(ANI Picture Service)
అదే సమయంలో ఏడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ రన్‌రేట్ -0.804గా ఉంది. తాజా మార్పుతో లక్నో కంటే మెరుగైన రన్‌రేట్ సాధించిన చెన్నై, ఈ జట్టును వెనక్కి నెట్టి ఏడో స్థానాన్ని ఆక్రమించింది. ఓడినా కూడా రన్‌రేట్ పెరగడం అనేది ఐపీఎల్ చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంటుంది.
(ANI Picture Service)
టాస్ గెలిచిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. ఛేదనలో సీఎస్కే ఒక దశలో విజయం దిశగానే సాగింది. చివరి 10 ఓవర్లలో 84 పరుగులు మాత్రమే అవసరమైన స్థితిలో మ్యాచ్ చెన్నై చేతుల్లోనే ఉంది. కానీ, శ్రీలంక పేసర్ ఈశాన్ మలింగ తనదైన యార్కర్లతో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు.
(AP)
మలింగకు తోడుగా యువ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ అద్భుతమైన స్పిన్‌తో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీయడమే కాకుండా, పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. వీరిద్దరి ధాటికి చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. తాజా గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి చేరుకుంది.
(ANI Picture Service)
E-Paper

