వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహం.. ఒకే ఫ్రేమ్‌లో జగన్, విజయ్, కేటీఆర్, అదానీ!
తమిళనాడు రాజధాని చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయా రెడ్డి వివాహ వేడుక అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖులు హాజరయ్యారు.

వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు దేశంలోని ప్రధాన రాజకీయ, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. త్రిష కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు హాజరయ్యారు. వధూవరుల వద్ద వేదికపై జగన్, విజయ్, కేటీఆర్ ముగ్గురూ ఆప్యాయంగా పలకరించుకోవడమే కాకుండా, ఒకే ఫ్రేమ్‌లో నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ వేడుకలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు పలువురు సినీ నటీనటులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ, టీవీకే, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకే చోట ఆప్యాయంగా కలుసుకోవడంతో ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

E-Paper

