ఈ తేదీలలో పుట్టిన వారు పరమశివుని అనంతమైన ఆశీర్వాదాలతో సంతోషంగా ఉంటారు!

మనం పుట్టిన తేదీ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి.  ఈ తేదీల్లో పుట్టిన వారికి శివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా, ఈ తేదీల్లో పుట్టిన వారు భక్తితో ఉంటారు. 

Published on: Jun 21, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తూనే ఉంటుంది. రాశుల ఆధారంగా మనం ఎలా అయితే భవిష్యత్తును తెలుసుకుంటాము, న్యూమరాలజీ ఆధారంగా కూడా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. దానితో పాటు ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది న్యూమరాలజీ ద్వారా చెప్పవచ్చు.

ఈ తేదీలలో పుట్టిన వారు పరమశివుని అనంతమైన ఆశీర్వాదాలతో సంతోషంగా ఉంటారు (pinterest)
ఈ తేదీలలో పుట్టిన వారు పరమశివుని అనంతమైన ఆశీర్వాదాలతో సంతోషంగా ఉంటారు (pinterest)

ఈరోజు కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మనం పుట్టిన తేదీ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లోపుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. వీటికి ఏదైనా గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ గ్రహం వలన మనిషిపై ప్రభావం పడుతుంది. వారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రవర్తన కూడా గ్రహాల ఆధారంగా ఉంటుంది.

రాడిక్స్ నెంబర్ 2

న్యూమరాలజీ ప్రకారం ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్సంఖ్య రెండు అవుతుంది. ఈ సంఖ్యలకు అధిపతి చంద్రుడు.

రాడిక్స్ నెంబర్ 2 వారు ఎలా ఉంటారు?

రాడిక్స్ నెంబర్ 2 వారు చాలా కష్టపడి పని చేస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రుని ప్రభావం ఉండడం వలన మీరు కాస్త సెంటిమెంటల్‌గా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి శివునిఅనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా, ఈ తేదీల్లో పుట్టిన వారు భక్తితో ఉంటారు. వారికి భగవంతునితో మంచి అటాచ్మెంట్ ఉంటుంది. హృదయంతో కనెక్ట్ అయి ఉంటారు. కష్టపడతారు, నిజాయితీపరులు.

కష్టపడి పని చేస్తారు, నిజాయితీగా ఉంటారు

న్యూమరాలజీ ప్రకారం రెండు సంఖ్య వారు ఎంతో కష్టపడి పని చేస్తారు, నిజాయితీగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు కష్టాల్లో ఉంటే చూడలేరు.

ఎందులోనైనా

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంతో కష్టపడిపని చేస్తారు. పైగా ఎప్పుడూ కూడా నిజాయితీతో ఉంటారు. ఏ ఫీల్డ్‌లో వారు అడుగుపెట్టినా కష్టపడి పనిచేస్తారు. నిజాయితీగా పని చేస్తారు. పని ప్రదేశంలో కూడా ఇతరులకు హెల్ప్ చేస్తారు. శివుని అనుగ్రహం ఉండడం వలన ఎల్లప్పుడూ కష్టాల నుంచి సులువుగా బయటపడతారు. మంచి నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More