...
...
Next Story

ద్వాదశ రాశులను ఏ దేవుడు లేదా ఏ దేవత పాలిస్తారు? ఆ రాశితో దైవిక సంబంధం ఏంటో తెలుసుకోండి!

రాశుల ఆధారంగా గ్రహాలు, దేవతలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశులకు ఏ దేవత అధిపతి, ఎవరు రక్షిస్తారు, ఎవరి ఆశీస్సులు మనపై ఉంటాయి ఇలాంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఏ దేవత ఏ రాశి వారికి అనుగ్రహాన్ని కలిగించి సంతోషంగా ఉంచుతుంది అనేది చూద్దాం.

Published on: Jul 3, 2025, 13:02:17 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మనకి మొత్తం 12 రాశులు ఉంటాయి. 12 రాశులకు ఆయా రాశుల ఆధారంగా గ్రహాలు, దేవతలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశులకుఏ దేవత అధిపతి, ఎవరు రక్షిస్తారు, ఎవరి ఆశీస్సులు మనపై ఉంటాయి ఇలాంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఏ దేవత ఏ రాశి వారికి అనుగ్రహాన్ని కలిగించి సంతోషంగా ఉంచుతుంది అనేది చూద్దాం.

మేష రాశి:

ద్వాదశ రాశులను ఏ దేవుడు లేదా ఏ దేవత పాలిస్తాడు?
ద్వాదశ రాశులను ఏ దేవుడు లేదా ఏ దేవత పాలిస్తాడు?

మేషరాశిని పరిపాలించే గ్రహం కుజుడు. కుజుడు అనుగ్రహంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు దృఢ నిశ్చయంతో ఉంటారు, పైగా ధైర్యవంతులు కూడా. దుర్గాదేవి మేష రాశి వారికి ధైర్యం, బలాన్ని అందిస్తుంది.

వృషభ రాశి:

వృషభరాశిని పరిపాలించేది శుక్రుడు. శుక్రుడు విలాసాలను అందిస్తాడు. లక్ష్మీదేవి వృషభ రాశి వారితో ఉండాలని అనుకుంటుంది. లక్ష్మీదేవి స్థిరత్వాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది.

మిథున రాశి:

మిథున రాశి వారిని బుధుడు పాలిస్తాడు. సరస్వతీ సంభాషణ, జ్ఞానాన్ని సూచిస్తుంది. కనుక సరస్వతీ దేవితో ఈ రాశి వారు అనుసంధానం చేయబడి ఉంటారు. వీరి జీవితంలో త్వరగా అభివృద్ధి పొందుతారు.

కర్కాటక రాశి:

కర్కాటకరాశి వారికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారు పార్వతీ దేవిని ఆరాధిస్తే మంచిది. పార్వతీ దేవి కుటుంబ సామరస్యాన్ని, పోషణను సూచిస్తుంది.

సింహ రాశి:

సింహ రాశి వారిని సూర్యుడు పాలిస్తాడు. కాళీ దేవత వారితో అనుసంధానం అవ్వాలని అనుకుంటుంది. ఈ రాశి వారు కాళీ మాతను ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

కన్యా రాశి:

కన్యారాశి వారిని బుధుడు పాలిస్తాడు. అన్నపూర్ణ దేవితో కన్యా రాశి వారికి సంబంధం కలిగి ఉంటుంది. కన్యా రాశి వారు అన్నపూర్ణ దేవిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది.

తులా రాశి:

వృశ్చికరాశి వారికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు చాముండేశ్వరిని క్రమం తప్పకుండా ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ధనస్సు రాశి:

ధనస్సురాశి వారికి అధిపతి గురువు. ధనస్సు రాశి వారు సరస్వతీ దేవితో అనుసంధానం అయితే మంచిది. విశేష ఫలితాలను పొందవచ్చు.

మకర రాశి:

మకర రాశి వారిని శనిదేవుడు పాలిస్తాడు. క్రమశిక్షణ, బాధ్యత వహించే దుర్గాదేవి వీరితో ఉండాలని అనుకుంటుంది. దుర్గాదేవిని మకర రాశి వారు ఆరాధిస్తే మంచిది.

కుంభ రాశి:

కుంభరాశి అధిపతి శని దేవుడు. ఈ రాశి వారు మాతంగీ దేవిని ఆరాధిస్తే మంచిది. సంతోషంగా ఉండచ్చు.

మీన రాశి:

మీన రాశి వారికి అధిపతి గురువు. లక్ష్మీదేవి మీన రాశి వారికి ఆశీర్వాదాలను ఇవ్వాలని అనుకుంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఈ రాశి వారు ఆరాధిస్తే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks