...
...
Next Story

Deori Mandir Mystery: 16 చేతుల కాళికా మాత.. సిమెంట్ లేకుండానే 700 ఏళ్ల నాటి నిర్మాణం.. ఎరుపు, పసుపు దారాలు కడితే చాలు!

Deori Mandir Mystery: జార్ఖండ్ రాష్ట్రం, రాంచీ సమీపంలోని దేవడీ ఆలయం ఆధ్యాత్మిక వింతలకు నిలయం. సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఎటువంటి సిమెంట్, సున్నం వాడకుండా కేవలం రాళ్లను ఇంటర్‌లాక్ చేసి నిర్మించారు. ఎంఎస్ ధోనీకి అత్యంత ఇష్టమైన ఈ క్షేత్రంలో అమ్మవారు 16 చేతులతో దర్శనమివ్వడం విశేషం.

Published on: May 7, 2026, 13:00:18 IST
Advertisement

Deori Mandir Mystery: భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు నిలయమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయం వెనక అద్భుతమైన గాధ ఉంటుంది. అలాగే సైన్స్‌ కి కూడా అందని రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి ధియోగర్ లో ఉన్న ఆలయం. జార్ఖండ్ రాష్ట్రం, రాంచికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం వుంది. ఆలయం దశాబ్దాల కాలంగా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. పైగా చాలా మంది సెలబ్రిటీలను కూడా ఈ ఆలయం ఆకర్షిస్తుంది.

Deori Mandir Mystery: 16 చేతుల కాళికా మాత.. సిమెంట్ లేకుండానే 700 ఏళ్ల నాటి నిర్మాణం (pinterest)
Deori Mandir Mystery: 16 చేతుల కాళికా మాత.. సిమెంట్ లేకుండానే 700 ఏళ్ల నాటి నిర్మాణం (pinterest)

ఆలయం భక్తుల పాలిట కల్పవల్లి అని చెప్పొచ్చు. టీమిండియా మ్యాజిక్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఆలయం అంటే ఎంతో భక్తి. ధోనీ ఏదైనా మ్యాచ్ లేదా సిరీస్‌కు ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఇంతటి గుర్తింపు పొందడానికి కారణం ఏంటి? ఈ విగ్రహ విశిష్టతతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాళ్ల మధ్య మొత్తం మ్యాజిక్

ఈ ఆలయం నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సుమారు 700 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయం చాలా స్పెషల్. సిమెంట్ లేదా సున్నం వంటివి ఆలయాన్ని నిర్మించేందుకు ఉపయోగించలేదు. కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్‌లాకింగ్ చేసే విధానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఈ ఆలయం ఏమాత్రం చెక్కుచెదరదు. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. పైగా మరో వింత ఏమిటంటే, ఈ ఆలయాన్ని ఏమాత్రం కూడా మళ్లీ పునర్నిర్మించడం కుదరదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ప్రయత్నం చేసినా వారికి నష్టమే వాటిల్లుతుందట. అందుకే ఈ క్షేత్రం ప్రాచీన రూపాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తోంది.

16 చేతులతో దర్శనమిచ్చే కాళికాదేవి

ఈ క్షేత్రంలో ఒక విభిన్నమైన ఆచారం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో వెదురు కర్రల అల్లికకు భక్తులు ఎరుపు లేదా పసుపు రంగు దారాలను కడతారు. మన కోరిక ఏదైనా సరే, ఇలా చేయడం వలన తీరిపోతుందట. ఆ తర్వాత భక్తులు మళ్లీ ఆలయానికి వచ్చి, కోరికలు తీరాక ఆ దారాన్ని విప్పి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పి వెళతారట. అంతేకాదు, ఆలయంలోకి అడుగుపెట్టగానే తెలియని ప్రశాంతత కలుగుతుంది.

ఆలయం వెనుక ఆసక్తికరమైన జానపద కథ కూడా ఉంది

వందల ఏళ్ల క్రితం తమార్ ప్రాంతాన్ని పాలించే రాజుకు అమ్మవారు కలలో కనపడ్డారట. అమ్మవారు ఒక అడవిలో నిర్దిష్ట ప్రదేశంలో ఉన్నానని అతనికి చెప్పగా, అప్పుడు ఆయన ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఆ కల ఆధారంగా రాజు అన్వేషణ మొదలుపెట్టి, అడవి మధ్యలో ఈ అమ్మవారి విగ్రహాన్ని కనుగొన్నారు. అనంతరం ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి కూడా భక్తుల పాలిట శక్తిపీఠంగా ఈ ఆలయం మారిపోయింది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe