అక్టోబరులో 6 గ్రహాలు సంచారంలో మార్పుతో అనేక శుభ యోగాలు.. ఈ రాశులకు బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది, ఉద్యోగాలతో పాటు ఎన్నో

అక్టోబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు కూడా ఉండబోతోంది. అక్టోబర్ 2025లో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని వారి రాశులను మారుస్తున్నారు. దీంతో ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడు అక్టోబర్ నెలలో రెండు సార్లు తన సంచారాన్ని మారుస్తాడు. 

Published on: Sep 22, 2025 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభయోగాలు, శుభయోగాలు ఏర్పడడం సహజం. దీపావళి, దసరా వంటి పండుగలు అక్టోబర్నెలలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు కూడా ఉండబోతోంది. అక్టోబర్ 2025లో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని వారి రాశులను మారుస్తున్నారు.

అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు (pinterest)
అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు (pinterest)

ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు

దీంతో ద్వాదశరాశులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడు అక్టోబర్ నెలలో రెండు సార్లు తన సంచారాన్ని మారుస్తాడు. అక్టోబర్ 3న బుధుడు తులా రాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 24న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 17న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.

అలాగే అక్టోబర్ నెలలో సూర్యుడు, బుధుడు కలిపి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అక్టోబర్లోనే కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో రుచకరాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడు,శని సంసప్తకరాజయోగం కూడా ఉంటుంది. న్యాయదేవుడు శని మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబర్లో ఉత్తరభాద్ర నక్షత్రంలోకి అడుగుపెడతాడు. గురువు మిథున రాశిలో ఉంటాడు. రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో సంచారం చేస్తాయి.

అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు, ఈ రాశుల వారికి బోలెడు లాభాలు ఇస్తుంది.

1.సింహ రాశి

సింహ రాశివారికి అక్టోబర్ నెల బాగా కలిసి వస్తుంది. చాలా సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. గొడవలు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో ఈ మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.

2.ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారికి అక్టోబర్ నెల అదృష్టం తీసుకువస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

3.కుంభ రాశి

కుంభ రాశివారికి అక్టోబర్ నెల బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులు చూస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More