ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికైనా సాయం చేస్తారు, శత్రువులను కూడా ప్రేమిస్తారు!

న్యూమరాలజీ కూడా మన జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా మంచివారు. వారి మనసు వెన్న, సహజంగానే ఇతరులపై కరుణ, ప్రేమను చూపిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారైతే చాలా మంచివారు. శత్రువులను కూడా ప్రేమిస్తారు.

Published on: Jul 8, 2025, 16:30:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీఆధారంగా ఒక మనిషి ఇతరులతో ఎలా మాట్లాడతారు, లైఫ్‌లో ఎలా సక్సెస్ అవుతారు, ఎవరు ఎక్కువగా కష్టపడతారు ఇలా చాలా విషయాలను తెలుసుకోవచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికైనా సాయం చేస్తారు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికైనా సాయం చేస్తారు (pinterest)

జ్యోతిష్య శాస్త్రం మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. న్యూమరాలజీ కూడా మన జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా మంచివారు. వారి మనసు వెన్న, సహజంగానే ఇతరులపై కరుణ, ప్రేమను చూపిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారైతే ఇంకా స్పెషల్. ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా మంచివారు. ఎంత మంచివారైనా శత్రువులను కూడా వారు ఇష్టపడతారు. మరి ఈ తేదీల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.

రాడిక్స్ నెంబర్ 9:

ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లోపుట్టిన వారు రాడిక్స్ నెంబర్ 9కి చెందినవారు. న్యూమరాలజీ ఆధారంగా ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా గొప్పవారు. మానవతావాదులు, సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలని కోరుకుంటారు. ఇతరుల కోసం ఏ మాత్రం చేయడానికి అయినా ముందుంటారు, స్వార్థం కూడా ఉండదు.

రాడిక్స్ నెంబర్ 6:

ఏదైనా నెలలో6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. ప్రేమ పంచడానికి ఎప్పుడూ ఈ తేదీల్లో పుట్టిన వారు ముందుంటారు. కుటుంబ సభ్యులపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అన్నిటిలో బాధ్యతగా ఉంటారు, అందరికీ మేలు చేస్తారు.

రాడిక్స్ నెంబర్ 3:

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 3 అవుతుంది. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, ప్రేమ, సానుభూతి చూపిస్తారు. వారి సమయాన్ని, శక్తిని ఇతరులతో పంచుకోవాలని అనుకుంటారు. ఎప్పుడూ ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరుల మేలు కోరుతారు, మంచి భావోద్వేగాలను పంచుకుంటారు, అందరికీ ఆప్యాయతను పంచుతారు.

రాడిక్స్ నెంబర్ 4:

ఏదైనానెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నెంబర్ 4కి చెందినవారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంతో బాధ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తోడుగా ఉంటారు. ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.

రాడిక్స్ నెంబర్ 2:

ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 2 అవుతుంది. వీరి హృదయం చాలా గొప్పది, అందరి పట్ల సానుభూతి చూపిస్తారు. ఎప్పుడూ ఎవరికైనా సహాయం కావాలంటే ముందుంటారు. ఆపదలో ఉన్న వారి శత్రువు అయినా సరే, పట్టించుకోకుండా, బాధలో ఉన్న వారిని ఓదారుస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More