...
...
Next Story

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ జంతువులు కనపడితే చాలా మంచిది.. పదవి, డబ్బు, ప్రేమ, కీర్తి ప్రతిష్టలు త్వరగా లభిస్తాయి!

ఒక్కోసారి భయంకరమైన పీడ కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎంతో సంతోషంగా ఉండే కలలు వస్తాయి. కొన్ని సార్లు మనం విజయాలు సాధించినట్లు, మంచి ఉద్యోగం లభించినట్లు ఇలా రకరకాల కలలు రావడం సహజమే. కలలో మనకి జంతువులు కూడా కనపడుతూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ జంతువులు కలలో కనపడితే చాలా మంచిది.

Published on: Nov 6, 2025, 12:00:15 IST
Advertisement

మనం నిద్రపోయినప్పుడు చాలా రకాల కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి భయంకరమైన పీడ కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎంతో సంతోషంగా ఉండే కలలు వస్తాయి. కొన్ని సార్లు మనం విజయాలు సాధించినట్లు, మంచి ఉద్యోగం లభించినట్లు ఇలా రకరకాల కలలు రావడం సహజమే. కొన్ని కలలు మనం ఉదయం లేచే సరికి మర్చిపోతూ ఉంటాం కూడా.

కలలో జంతువులు

స్వప్న శాస్త్రం ప్రకారం ఈ జంతువులు కలలో కనపడితే చాలా మంచిది (pinterest)
స్వప్న శాస్త్రం ప్రకారం ఈ జంతువులు కలలో కనపడితే చాలా మంచిది (pinterest)

నిజానికి, కలలను చాలా ముఖ్యమైన వాటిగా పరిగణించాలి. కొన్ని కలలు భవిష్యత్తుకి క్లూ ఇస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో స్వప్న శాస్త్రం కూడా ఒక భాగం. స్వప్న శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కలలు మనకి తెలిపే అర్థాలను చెప్తూ ఉంటాయి. కొన్ని కలల ద్వారా మనం అలర్ట్‌గా ఉండొచ్చు. అలాగే, కొన్ని కలలు మనం ఎలాంటి తప్పులు చేయకూడదనేది తెలుపుతూ ఉంటాయి. అయితే, ఒకసారి కలలో మనకి జంతువులు కూడా కనపడుతూ ఉంటాయి.

ఏమైనా జంతువులు కనపడితే అవి శుభ సూచకమా, అశుభ సూచకమా అని సందేహం వస్తూ ఉంటుంది. ఇలాంటి జంతువులు కలలో వచ్చినట్లయితే శుభ పరిణామంగా భావించాలి. వీటిని కలలో చూస్తే జీవితంలో చాలా మార్పులు వస్తాయని, ఎంతో మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మరి కలలో ఎలాంటి జంతువులు వస్తే మంచిదో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం ఈ జంతువులు కలలో కనపడితే చాలా మంచిది:

1.ఆవు:

కలలో ఆవు కనపడితే చాలా మంచిదానిగా భావించాలి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవుని చూస్తే సంపద పెరుగుతుంది, సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. హిందూమతంలో ఆవుని దైవంగా భావిస్తారు. కలలో ఆవు కనపడితే దేవుళ్లు, దేవతల అనుగ్రహం మీపై ఉందని అర్థం చేసుకోవాలి.

2.గుడ్లగూబ:

కలలో పాము కనపడితే కూడా మంచిదే. ముఖ్యంగా కలలో నల్లటి పాము కనబడితే ఆర్థికపరంగా బావుంటుంది, సంపద పెరుగుతుంది, సక్సెస్‌ను అందుకోవచ్చు, పురోగతిని చూస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు కూడా పెరుగుతాయి.

4.ఏనుగు:

కలలో ఏనుగు కనపడితే కూడా మంచిదానిగా భావించాలి. కలలో ఏనుగు కనపడితే సంపద పెరుగుతుంది, డబ్బు, పేరు, ప్రతిష్ఠలను కూడా పొందవచ్చు. ఇలాంటి కల వచ్చినట్లయితే సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు.

5.నెమలి:

కలలో నెమలి కనపడితే కూడా మంచి దానిగా భావించాలి. ఇది శుభసూచకం. నెమలి కలలో కనపడితే సంతోషం, ప్రేమ పెరుగుతాయి. శుభవార్తలను కూడా వినే అవకాశం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks