స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వెలుగుతున్న దీపం కనపడితే శుభమా, అశుభమా?

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు భయంకరమైనవి ఉంటాయి, కొన్ని కలలు మామూలుగా ఉంటాయి. కలలు మన భవిష్యత్తులో జరిగే విషయాలను సూచిస్తాయి. కలలో కనపడితే దీపం కనపడితే దానికి అర్థం ఏంటి? అది శుభ ఫలితాన్ని ఇస్తుందా? సమస్యలు ఏమైనా వస్తాయా వంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

Published on: Jul 14, 2025 3:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు భయంకరమైనవి ఉంటాయి, కొన్ని కలలు మామూలుగా ఉంటాయి, ప్రశాంతంగా అనిపిస్తాయి. ఒక్కోసారి పీడ కలలువస్తూ ఉంటాయి. అలాంటిప్పుడు మాత్రం అందరూ భయపడిపోతూ ఉంటారు.

కలలో దీపం కనపడితే మంచిదా కాదా? (pinterest)
కలలో దీపం కనపడితే మంచిదా కాదా? (pinterest)

స్వప్న శాస్త్రం ప్రకారం కలలకు అర్థాలు ఉంటాయి. కలలు మన భవిష్యత్తులో జరిగే విషయాలను సూచిస్తాయి. కలలో వెలుగుతున్న దీపం కనబడితే దానికి అర్థం ఏంటి? అది శుభ ఫలితాన్ని ఇస్తుందా? సమస్యలు ఏమైనా వస్తాయా వంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

కలలో దీపం కనపడితే మంచిదా కాదా?

ఒక్కోసారి కలలో వెలుగుతున్న దీపం కనపడుతూ ఉంటుంది. కలలో వెలుగుతున్న దీపం కనబడితే దానికి అర్థం ఏంటి అనే విషయానికి వస్తే, కలలో వెలుగుతున్న దీపాన్ని చూడడం మంచిదే. చిరకాల కోరిక నెరవేరిపోతుందని సూచిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

1.లక్ష్మీదేవి

దీపం వెలుగుకి చిహ్నం. వెలుగుతున్న దీపాన్ని మనం కలలో చూసినట్లయితే సానుకూలశక్తి వ్యాపిస్తుందని అర్థం. లక్ష్మీదేవి కూడా ఆ ఇంట కొలువై ఉంటుందని అర్థం.

2.భగవంతుని అనుగ్రహం

దీపాన్ని వెలిగిస్తున్నట్లు కలలు వచ్చినట్లయితే, జీవితంలోఉన్న సమస్యలు తొలగిపోతాయని, మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఆధ్యాత్మిక పురోగతి కూడా ఉంటుంది, భగవంతుని అనుగ్రహం ఉంటుంది.

3.పూర్వికులు సంతోషంగా

కలలో నదిలో కానీ, నీటిలో కానీ వెలుగుతున్న దీపం కనపడితే, పూర్వికులఆత్మలు సంతోషంగా ఉన్నాయని, భగవంతుని అనుగ్రహం కూడా మీపై ఉందని ఈ కలలు సూచిస్తాయి.

4.భక్తి మార్గం

కలలో దీపం కనబడితే, మీ మనసు ఇప్పుడు భక్తి మార్గంలో పయనిస్తుందని అర్థం. దీపం కాంతి ఆత్మ యొక్క చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. దీపం వెలిగించినట్లు కలలు రావడం లేదా వెలుగుతున్న దీపాన్ని కలలోచూడడం మంచిదే. ఇది ఆధ్యాత్మిక సంకేతం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వెలుగుతున్న దీపం కనపడితే శుభమా, అశుభమా?
News/Rasi Phalalu/స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వెలుగుతున్న దీపం కనపడితే శుభమా, అశుభమా?