తెలియకుండానే మీ సంపదను మీరే అడ్డుకుంటున్నారా..? ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి!
Financial Mindset Tips : ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు తొలగడం లేదా…? మీ సంపాదన కంటే మీ ఆలోచనా విధానం, అలవాట్లే మీ సంపదను నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ఎదుగుదలకు ఆటంకం కలిగించే కొన్ని కారణాలను ఇక్కడ తెలుసుకోండి…
Financial Mindset Tips : నేటి వేగవంతమైన కాలంలో ప్రతి ఒక్కరూ విపరీతంగా కష్టపడుతున్నారు. ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగం, మరోవైపు అదనపు ఆదాయం కోసం సైడ్ హసిల్స్.. ఇలా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ….. చాలా మందిలో ఆర్థిక ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక మాంద్యం వంటి బాహ్య కారణాలు నిజమే అయినప్పటికీ, మనకు తెలియకుండానే మనలో ఉండే కొన్ని అలవాట్లు, ఆలోచనా ధోరణి మన ఆర్థిక ఎదుగుదలను నిశ్శబ్దంగా అడ్డుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం డబ్బు గురించి ఎలా ఆలోచిస్తాం, మనకు వచ్చే అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటాం అనే అంశాలే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ విషయంలో నిపుణురాలు అక్షిత పచౌరీ విశ్లేషణ ప్రకారం.. మనం మార్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి.
అన్నింటికి 'సరే' చెప్పకండి….
చాలా మంది డబ్బు పోతుందనే భయంతో తమ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశానికి 'సరే' అంటుంటారు. కానీ, ఇలా శక్తిని అన్ని వైపులా ఖర్చు చేయడం వల్ల దేనిపైనా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేము. "చెల్లాచెదురైన శక్తితో నిజమైన సంపదను నిర్మించలేరు," అని అక్షిత పచౌరీ స్పష్టం చేశారు. ఏదైనా ఒక రంగంలో లోతైన అవగాహన, ఏకాగ్రత ఉంటేనే దీర్ఘకాలిక సంపద సాధ్యమవుతుంది.
బ్యాంక్ బ్యాలెన్స్ చూడటం…
మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఎప్పుడైనా గమనించారా? ఆ సమయంలో మీ మనసులో కలిగే భావన ఏంటి? చాలా మంది ఆందోళనతోనో, భయంతోనో బ్యాలెన్స్ చెక్ చేస్తారు. డబ్బుతో మీరు ముడిపెట్టే ఈ ప్రతికూల ఎమోషనల్ ఎనర్జీ మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. డబ్బు పట్ల కృతజ్ఞత, స్పష్టమైన అవగాహన ఉండాలే తప్ప, ఎప్పుడూ ఒత్తిడితో కూడిన బంధం ఉండకూడదు.
స్థిరత్వం కోసం వేచి చూడటం…
"నేను పూర్తిస్థాయిలో సెటిల్ అయ్యాక పెట్టుబడులు మొదలుపెడతాను" అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆర్థికంగా విజయం సాధించిన వారు ఎప్పుడూ సరైన సమయం కోసం వేచి చూడలేదు. వారు చిన్న మొత్తంతోనే ప్రారంభించి, కాలక్రమేణా స్థిరత్వాన్ని నిర్మించుకున్నారు. పరిస్థితులు అన్నీ అనుకూలించిన తర్వాతే మొదలుపెడదాం అనుకుంటే, విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
మీ మాటలే మీ భవిష్యత్తు…
డబ్బు గురించి మీరు మాట్లాడే తీరు కూడా కీలకమే. "నా దగ్గర డబ్బు లేదు", "డబ్బు అస్సలు నిలవడం లేదు", "డబ్బు రావడం చాలా కష్టం" అని నిరంతరం అనడం వల్ల అది మీ ఉపచేతన మనసులో ముద్ర పడిపోతుంది. మీ నమ్మకాలే మీ చర్యలను ప్రభావితం చేస్తాయి. అందుకే డబ్బు పట్ల సానుకూల దృక్పథంతో ఉండటం అవసరం.
వ్యక్తుల ప్రభావం…
మీరు ఎవరితో సమయం గడుపుతున్నారు అనే దానిపై మీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ డబ్బు గురించి ఫిర్యాదు చేసేవారు, సంకుచితంగా ఆలోచించే వ్యక్తుల మధ్య ఉంటే.. మీరు కూడా అదే పరిధిలో ఉండిపోతారు. మీ ఆలోచనలను విస్తృతం చేసే…. మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి.
చివరగా, సంపాదన, ఖర్చుల కంటే మించి డబ్బుతో మీకున్న భావోద్వేగ సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనలోని పాత పద్ధతులను గుర్తించి వాటిని మార్చుకున్నప్పుడే ఆర్థికంగా ఉన్నత శిఖరాలను చేరుకోగలం.
గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు, నిర్ణయాలను బట్టి ఫలితాలు భిన్నంగా ఉండవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

