ఆషాడ, శ్రావణ మాసాల్లో ప్రధాన గ్రహాల కదలికలో మార్పులు, నాలుగు రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బు, వాహనాలు, భూములు ఇలా ఎన్నో!
జూలై, ఆగస్టు నెలల్లో ప్రధాన గ్రహాల కదలికలో మార్పు జరుగుతుంది. ఆషాడ మాసం, శ్రావణ మాసంలో ఈ ప్రధాన గ్రహాల మార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏ రాశుల వారు శుభ ఫలితాలను అందుకుంటారు, వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
జూలై, ఆగస్టు నెలల్లో ప్రధాన గ్రహాల కదలికలో మార్పు జరుగుతుంది. ఆషాడ మాసం, శ్రావణ మాసంలో ఈ ప్రధాన గ్రహాల మార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. ఆ తర్వాత జూలై 16న సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించాడు. ప్రేమ విలాసాలకు కారకుడైన శుక్రుడు జూలై 26న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఇదిలా ఉంటే జూలై 28న కుజుడుకన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 9న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఆషాడ, శ్రావణ మాసాలలో ప్రధాన గ్రహాల కదలిక జరుగుతుంది. దీంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏ రాశుల వారు శుభ ఫలితాలను అందుకుంటారు, వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
ఆషాడ శ్రావణ మాసాల్లో ప్రధాన గ్రహాల కదలికలో మార్పులు, ఈ రాశుల వారికి శుభ ఫలితాలు:
1.వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ప్రధాన గ్రహాల కదలికలో మార్పు రావడంతో కెరియర్, ఉద్యోగం, ప్రయాణాలలో ప్రత్యేక లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరియర్, బిజినెస్‌లో కూడా సక్సెస్‌ను పొందుతారు. శ్రావణ మాసంలో శివుడిని పూజిస్తే ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
2.కర్కాటక రాశి:
ఈ రాశివారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రధాన గ్రహాల కదలికలో మార్పులు రావడంతో ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడతారు. కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్లు వస్తాయి. పాత విషయాలపై ఉన్న భయం తొలగిపోతుంది.
3.తులా రాశి:
తులా రాశివారికి కూడా ఆషాడ, శ్రావణ మాసంలో గ్రహాల కదలికల మార్పు వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది.
4.కుంభ రాశి:
కుంభ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. కొత్త వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొత్త కోర్సులను కూడా నేర్చుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



