బంగారు ఆభరణాలను ధరించడం ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరూ కూడా బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. పైగా బంగారం సంపద, శ్రేయస్సు, అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఈ విలువైన లోహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బంగారు ఆభరణాలను ధరించేటప్పుడు మొదట లక్ష్మీదేవి ముందు పెట్టి, ఆ తర్వాత వాటిని ధరిస్తారు. అయితే బంగారు ఉంగరాలను ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరిస్తే మంచిది? ఏ వేలికి ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం లక్ష్మీదేవి స్వరూపం

అందం, అదృష్టం, విలాసం కోసం చాలా మంది బంగారాన్ని ధరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు బంగారు ఆభరణాలను ధరిస్తారు, ఇష్టపడతారు. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు, అందుకనే ప్రత్యేకించి గౌరవిస్తారు. ప్రతి శుభ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తారు. బంగారు ఉంగరాన్ని ఏ వేలికి ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.
బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి?
ఉంగరం వేలు:
బంగారు ఉంగరాన్ని ఉంగరం వేలికి పెట్టుకుంటే ఆధ్యాత్మిక శక్తులను ఆకర్షించవచ్చు. ఆనందం, ఉత్సాహం, శాంతి కలుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఉంగరం వేలికి బంగారు ఉంగరాన్ని ధరిస్తే దుష్టశక్తుల వలన కలిగే అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక బలం పొందవచ్చు. స్త్రీలు ఎడమచేతి ఉంగరం వేలికి, పురుషులు కుడిచేతి ఉంగరం వేలికి బంగారు ఉంగరాన్ని ధరిస్తే మంచిది.
చూపుడు వేలు:
బంగారు ఉంగరాన్ని చూపుడు వేలికి పెట్టుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. కెరీర్, వ్యక్తిగత జీవితంలో అదృష్టం కలుగుతుంది. మానసిక ఒత్తిడినుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
మధ్య వేలు:
మధ్య వేలుకు బంగారు ఉంగరాన్ని పెట్టుకుంటే సమతుల్యత లభిస్తుంది, స్థిరత్వం పెరుగుతుంది. అదృష్టాన్ని పొందడానికి వీలవుతుంది. కీర్తి, హోదాకు సంబంధించి సమస్యలు ఉన్నట్లయితే మధ్య వేలికి బంగారం ఉంగరాన్ని ధరించండి.
చిటికెన వేలు:
చిటికెన వేలుకు బంగారం ఉంగరాన్ని ధరిస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఈ వేలికి బంగారం ఉంగరాన్ని పెట్టుకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుంది. చిటికెన వేలుకు బంగారం ఉంగరాన్ని ధరిస్తే జలుబు, దగ్గు సమస్యలు కూడా తగ్గిపోతాయి.
బొటన వేలు:
{{/usCountry}}చిటికెన వేలుకు బంగారం ఉంగరాన్ని ధరిస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఈ వేలికి బంగారం ఉంగరాన్ని పెట్టుకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుంది. చిటికెన వేలుకు బంగారం ఉంగరాన్ని ధరిస్తే జలుబు, దగ్గు సమస్యలు కూడా తగ్గిపోతాయి.
బొటన వేలు:
{{/usCountry}}బంగారం ఉంగరాన్ని బొటన వేలికి పెట్టుకుంటే వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అదృష్టం పెరుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు.
గ్రహాలతో సంబంధం
బంగారంతో అన్ని గ్రహాలకు సంబంధం ఉంటుంది. ముఖ్యంగా గురు గ్రహంతో ముడిపడి ఉంటుంది. బంగారం సూర్యుడు లాంటి శక్తివంతమైన గ్రహాలతో సంబంధం కలిగిఉంటుంది.