కొన్ని రోజుల్లో గజలక్ష్మీ, ద్విద్వాదశ రాజయోగాలు, 3 రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు.. డబ్బు, ప్రమోషన్లు ఇలా ఎన్నో
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గజలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ యోగం, గురువు–శుక్రుడు మిథున రాశిలో సంయోగం చెంది ఏర్పరుస్తున్నాయి. ఇది డబ్బు, అందం మొదలైన వాటిని తీసుకువస్తుంది. దీనితో పాటుగా ద్విద్వాదశ యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో అదృష్టం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ఇక ఇది ఇలా ఉంటే, సోమవారం ఆగస్టు 4న చాలా స్పెషల్. ఎందుకంటే, ఆ రోజు అరుదైన యోగాలు ఏర్పడతాయి. దీంతో నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గజలక్ష్మిరాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ యోగం, గురువు–శుక్రుడు మిథున రాశిలో సంయోగం చెంది ఏర్పరుస్తున్నాయి. ఇది డబ్బు, అందం మొదలైన వాటిని తీసుకువస్తుంది.

దీనితో పాటుగా ద్విద్వాదశయోగం కూడా ఏర్పడుతుంది. సూర్యుడు–గురువు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. అంతేకాకుండా, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సూర్యుడు బుధుడుతో సంయోగం చెంది బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాడు.
దీంతో తెలివితేటలు పెరుగుతాయి, నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ అవుతాయి. మొత్తం ఇవన్నీ శుభయోగాలు. ఇవి కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. దాంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు, సంతోషంగా ఉంటారు.
గజలక్ష్మి యోగం ఈ రాశుల వారికి అదృష్టం తీసుకువస్తుంది
1.వృషభ రాశి:
వృషభరాశి వారికి శుభ ఫలితాలని తీసుకొస్తుంది. ఎప్పటినుంచో పూర్తిగా నీ పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారులకు కూడా బాగుంటుంది.
2.కన్య రాశి:
కన్య రాశివారికి ఈ యోగాల కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ని అందుకుంటారు. పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది, నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. కొత్త బాధ్యతలను తీసుకుంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశం ఉంది.
3.తులా రాశి:
తులా రాశి వారికి ఈ సమయం మంచి జరుగుతుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లి కానివారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



