41 రోజులు అయ్యప్ప దీక్ష వలన కలిగే లాభాలు, నల్ల దుస్తులు ఎందుకు ధరించాలో తెలుసుకోవడంతో పాటు ఎవరు మాల వేసుకోకూడదు చూడండి!

కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి దాకా చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల ధరించి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు. 41 రోజులు కఠిన నియమ నిష్టలతో, భక్తి శ్రద్దలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు. అయ్యప్ప మాలను ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి? మాల వేసిన వారిని ఎందుకు “స్వామి” అని పిలుస్తారు? 

Published on: Oct 14, 2025 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి దాకా చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల ధరించి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు. 41 రోజులు కఠిన నియమ నిష్టలతో, భక్తి శ్రద్దలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు.

అయ్యప్ప దీక్ష (pinterest)
అయ్యప్ప దీక్ష (pinterest)

ఈ సమయంలో నేల మీద నిద్రపోవడం, చల్లటి నీటితో మాత్రమే స్నానం చేయడం, చెప్పులు వేసుకోకుండా ఉండడం, నల్లని దుస్తులు మాత్రమే ధరించడం వంటి నియమాలను ఎన్నో పాటిస్తూ ఉంటారు. అయితే, అయ్యప్ప మాలను ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి? మాల వేసిన వారిని ఎందుకు “స్వామి” అని పిలుస్తారు? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్వామి అని ఎందుకు పిలవాలి?

అయ్యప్ప మాల వేసుకున్నాక ప్రతి ఒక్కరిలో “నేను” అన్న భావన పోతుంది. శరీరానికి ఉండే పేరు ఉండదు. ధరించే దుస్తులు, ఆహారం, ఆచార వ్యవహారాలు, అయ్యప్ప దీక్ష చేపట్టగానే అన్నీ కూడా మారతాయి. అందుకే ఆ వ్యక్తిని అంతర్దానంలో భగవంతుడు స్వరూపంగా భావించి, మనుషులందరిలో దేవుడు ఉన్నాడనే భావనతో “స్వామి” అని పిలుస్తారు.

ఎలాంటి మాలలు ధరిస్తారు?

అయ్యప్ప దీక్ష మణిమాలతో మొదలవుతుంది. ఈ దీక్షను 41 రోజులు పాటు కొనసాగిస్తారు. అయ్యప్ప దీక్ష చేపట్టేవారు తులసి మాల, రుద్రాక్ష మాల, చందనం మాల, స్పటిక మాల, పగడాల మాల, తామర పూసల మాలలు వంటివి ధరిస్తారు. వీటిని ధరించడం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ బాగుంటాయి. ఈ 41 రోజుల పాటు దీక్షను చేపడితే సంతోషంగా ఉండొచ్చని, స్వామివారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఆ తర్వాత 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు.

ఎవరు మాల వేసుకోకూడదు?

కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు 41 రోజుల పాటు అయ్యప్ప మాలను వేసుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరైనా మరణిస్తే, ఏడాది పాటు మాల వేసుకోకూడదు. భార్య చనిపోయిన సందర్భంలో కూడా ఆరు నెలల పాటు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

ఎందుకు నల్ల దుస్తులు ధరించాలి?

అయ్యప్ప దీక్ష చేపట్టే వారంతా నల్లని దుస్తులు మాత్రమే ధరిస్తారు. శని దేవుడికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఆ రంగు బట్టలు వేసుకుంటే శని ప్రభావం తగ్గుతుంది. చలికాలంలోనే అయ్యప్ప మాలను వేసుకుంటారు. ఆ సమయంలో నల్లని దుస్తులు వెచ్చగా ఉంటాయి.

జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం

వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం..

News/Rasi Phalalu/41 రోజులు అయ్యప్ప దీక్ష వలన కలిగే లాభాలు, నల్ల దుస్తులు ఎందుకు ధరించాలో తెలుసుకోవడంతో పాటు ఎవరు మాల వేసుకోకూడదు చూడండి!
News/Rasi Phalalu/41 రోజులు అయ్యప్ప దీక్ష వలన కలిగే లాభాలు, నల్ల దుస్తులు ఎందుకు ధరించాలో తెలుసుకోవడంతో పాటు ఎవరు మాల వేసుకోకూడదు చూడండి!