...
...
Next Story

తెలంగాణాలో బోనాలు, జానపద నృత్యాలు, మహంకాళికి పూజలు.. బోనం అంటే ఏంటి, బోనాల చరిత్ర తెలుసుకోండి!

తెలంగాణ అంతటా బోనాలు మొదలయ్యాయి. 2025లో జూన్ 29న, ఆదివారం నుంచి జరుపుతున్నారు. ఆషాఢ మాసంలో బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

Published on: Jul 1, 2025, 16:30:07 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

బోనాలు గురించి తెలియని వారు ఉండరు. తెలంగాణలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. బోనాలు పండుగ మొదలైపోయింది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజుతెలుసుకుందాం.

తెలంగాణాలో బోనాలు (pinterest)
తెలంగాణాలో బోనాలు (pinterest)

మొత్తం తెలంగాణ అంతటా బోనాలు మొదలయ్యాయి. 2025లో జూన్ 29న, ఆదివారం నుంచి జరుపుతున్నారు. ఆషాఢమాసంలో బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. అసలు బోనాలు పండుగ అంటే ఏంటి? దీని చరిత్ర, ముఖ్యమైన తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహాకాళి దేవి

తెలంగాణ సంస్కృతిని ప్రదర్శిస్తూ, మహాకాళి అమ్మవారిని పూజిస్తారు. ఇలా ఈ బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగసమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. జూన్ 29 మొదలైన బోనాలు జూలై 20 వరకు కొనసాగుతాయి.

అసలు బోనం అంటే ఏంటి?

బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది దేవతలకు ఇచ్చే నైవేద్యాలలో ఒకటి అని చెప్పవచ్చు. మట్టి, ఇత్తడి కుండలో పాలు, బెల్లం వేసి అన్నాన్ని వండుతారు. దీనిని వేప, పసుపు, సింధూరంతో అలంకరించి, దీపాన్ని వెలిగించి బోనం పై పెడతారు. దానిని అమ్మవారికిసమర్పిస్తారు.

బోనాల చరిత్ర తెలుసా?

జంట నగరాల్లో 1813లో ఒక వ్యాధి వచ్చింది. ఆ సమయంలో చాలా మంది చనిపోయారు, వేలాది మంది ప్రాణాలు పోవడంతో మహాకాళి ఆలయంలోప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత ఆ వ్యాధి తగ్గింది. దీంతో అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాదులో ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఇక్కడ బోనాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది.

బోనాల సమయంలో మహిళలు, ఆడపడుచులు అందంగా తయారై, సంప్రదాయ గీతాలకు తగ్గట్టుగా నృత్యం చేస్తారు. బోనాలను తయారు చేసి, అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలు తీసుకెళ్లే వారి పాదాలపై నీళ్లు జల్లి శాంతి పరుస్తారు.

లష్కర్ బోనం అంటే ఏంటి?

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks