...
...
Next Story

మరి కొన్ని రోజుల్లో చతుర్ గ్రాహి యోగం, ఈ ఐదు రాశుల కష్టాలు పరార్.. ధనం, ఆస్తి లాభం, ప్రొమోషన్లతో పాటు ఎన్నో!

మిథున రాశిలో చతుర్ గ్రాహి యోగం జూన్ 26న ఏర్పడనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు, బుధుడు, గురువు, చంద్రుడు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం ఐదు రాశుల వారికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందించనుంది.

Published on: Jun 14, 2025, 09:00:16 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెల కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఈ నెల చివర్లో చతుర్ గ్రాహి యోగం ఏర్పడుతుంది.

మరి కొన్ని రోజుల్లో చతుర్ గ్రాహి యోగం (pinterest)
మరి కొన్ని రోజుల్లో చతుర్ గ్రాహి యోగం (pinterest)

మిథున రాశిలో చతుర్ గ్రాహి యోగం జూన్ 26న ఏర్పడనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు, బుధుడు, గురువు, చంద్రుడు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం ఐదు రాశుల వారికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందించనుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

చతుర్ గ్రాహి యోగంతో ఈ ఐదు రాశుల వారికి ఊహించని లాభాలు

1.సింహ రాశి

సింహరాశి వారికి చతుర్ గ్రాహి యోగం అనేక రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయి. సంపాదన పెరుగుతుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచీ ఎదురుచూస్తున్న డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి. సోదరులు, సోదరులతో బంధం మధురంగా మారుతుంది.

2.వృషభ రాశి

వృషభరాశి వారికి చతుర్ గ్రాహి యోగం అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ మాటలను చుట్టుపక్కల ఉన్న వారందరూ కఠినంగా తీసుకుంటారు. పూర్వికుల ఆస్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డబ్బులపై ఆధారపడటం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. పుణ్య కార్యాల వలన ఆర్థికపరంగా ప్రయోజనాలు ఉంటాయి.

3.మిథున రాశి

మిథునరాశి వారికి ఈ సమయంలో అనేక లాభాలు ఉంటాయి. కెరీర్‌లో, వ్యాపారంలో కూడా చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. చదువుపరంగా కూడా విజయాన్ని సాధించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. పిల్లల విషయంలో సంతోషపడతారు.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి చతుర్ గ్రాహి యోగం అనేక లాభాలను అందిస్తుంది. రాశి వారి సమయంలో కొత్త అవకాశాలను పొందుతారు. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. విద్య, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది.

5.తులా రాశి

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe