దీపావళి నాడు ఏ దీపాలను వెలిగించాలి? నూనె దీపాలా, నెయ్యి దీపాలా?

దీపావళి నాడు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కుటుంబ సమేతంగా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి నాడు వినాయకుడిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆ సమయంలో కూడా నేతితో దీపారాధన చేస్తే మంచిది. దీపావళికి దీపాలను వెలిగించేటప్పుడు వాటిని నేతితో వెలిగించాలా? లేక నూనెతో వెలిగించాలా?

Published on: Oct 15, 2025, 09:17:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరి కొన్ని రోజుల్లో దీపావళి వచ్చేస్తోంది. దీపావళి నాడు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కుటుంబ సమేతంగా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల పండుగ. దీపావళి నాడు కుటుంబ సమేతంగా దీపాలను వెలిగిస్తారు. ఆ తర్వాత టపాసులు కాలుస్తారు. వివిధ రకాల పిండి వంటలను చేసుకుని సంతోషంగా తింటారు.

దీపావళి 2025 (pinterest)
దీపావళి 2025 (pinterest)

దీపావళి 2025

ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20, సోమవారం నాడు వచ్చింది. ఆ రోజున అందరూ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. దీపాలతో ఇళ్ళు కళకళ్ళాడతాయి. పూజ లేదా ఇంట్లో దీపాలను వెలిగించడానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, దీపావళికి దీపాలను వెలిగించేటప్పుడు వాటిని నేతితో వెలిగించాలా? లేక నూనెతో వెలిగించాలా అని, మరి ఎలా దీపాలను వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

నేతి దీపాలు:

భగవంతుని ఆరాధించేటప్పుడు నేతితో దీపారాధన చేస్తే శ్రేష్టమని చెప్తారు. దీపావళి నాడు కూడా నేతితో దీపారాధన చేయొచ్చు. అలా చేయడం వలన సులువుగా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. దీపావళి నాడు వినాయకుడిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆ సమయంలో కూడా నేతితో దీపారాధన చేస్తే మంచిది. అలా చేయడం వలన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

లక్ష్మీదేవి వస్తుంది

దీపావళి నాడు నేతితో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, సంతోషం, డబ్బు కలిగి, ఏ బాధ లేకుండా హాయిగా జీవించొచ్చు. వినాయకుడికి నేతితో దీపారాధన చేయడం వలన విజయాలను అందుకోవచ్చు. కాబట్టి దీపావళికి నేతితో దీపారాధన చేయొచ్చు. దీని వలన సానుకూల ఫలితాలను చూస్తారు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

నూనె దీపాలు:

నూనె దీపాలను కూడా దీపావళి నాడు వెలిగించచ్చు. ప్రతి ఇంట్లో కూడా అన్ని మూలల్లో నూనె దీపాలను వెలిగిస్తారు. నేతితో దీపారాధన చేయడం కొంచెం ఖర్చుతో కూడుకున్నది అనుకునే వారు నూనెతో దీపాలను వెలిగించవచ్చు. ఉదయం, సాయంత్రం చాలామంది ఇళ్లల్లో నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, ఆవాల నూనె వంటి నూనెలతో దీపారాధన చేయొచ్చు.

పెద్ద వత్తులతో దీపాలను వెలిగిస్తే బాగా కలిసి వస్తుంది

మీరు పూజించే దేవుడిని బట్టి నూనెను వాడండి. ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. సంపదకు లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. దీపావళి నాడు దీపాలను వెలిగించేటప్పుడు పెద్ద వత్తులతో దీపాలను వెలిగిస్తే బాగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More