...
...
Next Story

మంచం పక్కన ఈ 5 వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం వెంటనే తొలగించండి!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువును సరైన దిశలో, సరైన ప్రదేశంలో ఉంచడం ఎంతో ముఖ్యమని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా పడకగదిలో మంచం చుట్టూ ఉండే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Published on: Nov 18, 2026, 11:00:40 IST
Advertisement

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు నియమాలను అనుసరించడం వల్ల సానుకూల మార్పులను చూడొచ్చని, ప్రతికూల ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో ఇంట్లో ప్రతి వస్తువును సరైన దిశలో, సరైన ప్రదేశంలో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు.

మంచం పక్కన ఈ 5 వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం వెంటనే తొలగించండి!
మంచం పక్కన ఈ 5 వస్తువులు ఉన్నాయా? వాస్తు ప్రకారం వెంటనే తొలగించండి!

ఇంట్లో ఉండే వస్తువులు పరిసర వాతావరణంపై, మనిషి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతారు. పడకగదిలో, మంచం చుట్టూ ఉండే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మంచం పక్కన ఈ వస్తువులు ఏమాత్రం ఉండడం మంచిది కాదు. వీటి వల్ల సమస్యలు వస్తాయి. చాలా రకాలుగా బాధలు పడాల్సి ఉంటుంది.

రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా మంది మంచం పక్కన రకరకాల వస్తువులను ఉంచుతారు. చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు వంటివి పెడుతూ ఉంటారు. మన దగ్గర కొన్ని వస్తువులు ఉండడం అశుభంగా చెబుతారు. నిద్రపోయేటప్పుడు పొరపాటున కూడా మంచం పక్కన ఈ వస్తువులు లేకుండా చూసుకోండి.

చెత్తబుట్ట:

వాస్తు ప్రకారం చెత్తబుట్టను మంచం పక్కన పెట్టడం మంచిది కాదు. ఇది ప్రతికూలతకు కారణం అవుతుంది. మంచం పక్కన ఉంచడం వల్ల సానుకూల వాతావరణానికి ఆటంకం కలుగుతుంది. మనసులో ప్రశాంతత తగ్గుతుంది.

చెప్పులు, బూట్లు:

వాస్తు ప్రకారం చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉపయోగించే చెప్పులైనా సరే మంచం పక్కన లేకుండా చూసుకోండి. ప్రతికూల శక్తికి ఇదే కారణం అవుతుంది. మంచం దగ్గర లేదా తలవైపు ఉంచడం వల్ల గదిలో సానుకూల శక్తిపై ప్రభావం పడుతుంది. కాబట్టి వీటిని తొలగించాలి.

నీళ్ల గ్లాసు:

కత్తులు, బ్లేడ్లు, కత్తెరలు లాంటి పదునైన వస్తువులను మంచం పక్కన పెట్టడం మంచిది కాదు. వీటిని నిద్రించే ప్రదేశానికి దూరంగా ఉంచాలి. లేకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళన కూడా పెరుగుతుంది. అందుకే ఇలాంటి వస్తువులను మంచం పక్కన పెట్టుకోకూడదు.

మంచానికి ఎదురుగా అద్దం:

నిద్రపోయేటప్పుడు మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. మంచంపై నుంచి మన ప్రతిబింబం అద్దంలో కనిపించడం అశుభంగా భావిస్తారు. ఇలా ఉండడం వల్ల నిద్రకు ఆటంకాలు కలుగుతాయి. మానసిక శాంతి తగ్గి, దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. కాబట్టి ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks