చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో ఇబ్బందులు, గొడవలు కూడా ఉండవు. సానుకూల వాతావరణంతో సంతోషంగా ఉండొచ్చు.

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా బలపడతాయి. అయితే, వాస్తు ప్రకారం బాత్రూంలో కొన్నిటిని పెట్టడం మంచిది కాదు. మరి వాస్తు ప్రకారం బాత్రూంలో ఎటువంటి వాటిని పెట్టకూడదు, ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో వీటిని పొరపాటున కూడా పెట్టకండి
1.పగిలిపోయిన అద్దాలు:
వాస్తు ప్రకారం బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు వంటివి పెట్టడం మంచిది కాదు. చాలామంది గాజు తలుపులు వంటివి పగిలిపోయినప్పుడు బాత్రూంలో వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వలన ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. సానుకూల శక్తికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి పొరపాటు జరగకుండా చూసుకోండి.
2.ఖాళీ బకెట్:
వాస్తు శాస్త్రం ప్రకారం ఖాళీ బకెట్‌ను కూడా బాత్రూంలో ఉంచడం మంచిది కాదు. అలా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు బకెట్‌ను ఖాళీగా ఉంచకండి. కొంచెం నీళ్లు వదిలేసినా సరిపోతుంది. లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
3.బాత్రూంలో మొక్కలు పెట్టకండి:
ఈ మధ్యకాలంలో చాలామంది ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచుతున్నారు. కానీ బాత్రూంలో మొక్కలు పెట్టడం మంచిది కాదు. బాత్రూంలో మొక్కలు ఉంటే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండిపోయిన మొక్కలు వంటివి కూడా బాత్రూంలో పెట్టడం మంచిది కాదు. కనుక ఈ తప్పును చేయకుండా చూసుకోండి.
4.తడి బట్టలు, పొడి బట్టలు:
బాత్రూంలో తడి బట్టలు, పొడి బట్టలు పెట్టడం కూడా మంచిది కాదు. బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తడి బట్టల నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే బాత్రూంలో ఉన్న బట్టలను అప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
5.టాయిలెట్ సీట్ ఈ దిశలో ఉండకూడదు:
{{/usCountry}}బాత్రూంలో తడి బట్టలు, పొడి బట్టలు పెట్టడం కూడా మంచిది కాదు. బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తడి బట్టల నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే బాత్రూంలో ఉన్న బట్టలను అప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
5.టాయిలెట్ సీట్ ఈ దిశలో ఉండకూడదు:
{{/usCountry}}చాలామంది టాయిలెట్ సీట్లను తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండేలా చూస్తారు. అదే తప్పు. ఆ దిశల్లో ఉండకూడదు. టాయిలెట్ సీట్లను వాయవ్య లేదా దక్షిణ దిశలో ఉంచాలి.
6.చెక్క ఫర్నిచర్ పెట్టకండి:
బాత్రూంలో చెక్క ఫర్నిచర్ పెట్టడం మంచిది కాదు. చెక్క షేల్ఫ్స్, టేబుల్స్ వంటి వాటిని పెడితే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సానుకూల శక్తి దూరం అవుతుంది.
7.చిరిగిపోయిన ఫోటోలు:
బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. కొంతమంది పెయింటింగ్స్, ఫోటోలు వంటివి పెడుతూ ఉంటారు. అవి పాడైపోయినవి అయితే వెంటనే తొలగించండి. చిరిగిపోయినవి ఉంటే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.