వాస్తు ప్రకారం ఈ గుర్తులు ఇంటి ముఖద్వారంపై ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.. సానుకూల శక్తి ప్రవహిస్తుంది!

హిందూ మతం ప్రకారం కొన్ని ఫోటోలు, చిహ్నాలు సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అయితే, వాటిని ఇంటి సరైన దిశలో ఉంచితే చక్కటి ఫలితం కనబడుతుంది, ఎన్నో మార్పులు చూడొచ్చు.ఈరోజు వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారానికి ఈ గుర్తులు ఉంటే మంచి జరుగుతుంది.

Published on: Jul 20, 2025 9:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ గుర్తులు ఇంటికి ఉన్నట్లయితే, సానుకూల శక్తి వ్యాపించడంతో పాటుగా అనేక లాభాలని పొందవచ్చు.

ఇంటి ప్రధాన ద్వారం ఈ గుర్తులు ఉంటే మంచిది (pixabay)
ఇంటి ప్రధాన ద్వారం ఈ గుర్తులు ఉంటే మంచిది (pixabay)

వాస్తుప్రకారం, హిందూ మతం ప్రకారం కొన్ని ఫోటోలు, చిహ్నాలు సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అయితే, వాటిని ఇంటి సరైన దిశలో ఉంచితే చక్కటి ఫలితం కనబడుతుంది, ఎన్నో మార్పులు చూడొచ్చు.ఈరోజు వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారానికి ఈ గుర్తులు ఉంటే మంచి జరుగుతుంది.

1.ఓంకారం:

ఓంకారం ఇంటి తలుపుకు ఉండడం వలన శుభఫలితాలు కనపడతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి, కచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఓంకారం ఉండేటట్టు చూసుకోండి.

2.పంచశూల:

వాస్తు ప్రకారం, ఇది సానుకూలశక్తిని ప్రవహించేలా చేసి, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంటి ప్రధాన దగ్గర, ప్రధాన ద్వారం దగ్గర ఇది ఉంటే సంతోషం, శాంతి కలుగుతాయి.

3.స్వస్తిక్:

ఇంటిప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఈ గుర్తు సానుకూల శక్తిని తీసుకురావడమే కాక, వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.

4.కమలం పువ్వు:

హిందూపురాణాల ప్రకారం, కమలం పువ్వు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంటే మంచి జరుగుతుంది. కమలం గుర్తుని ఇంటి ప్రధాన ద్వారం మీద వేయడం వలన సిరి సంపదలకు లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

5.త్రిశూలం:

త్రిశూలం గుర్తు ప్రధాన ద్వారం పై ఉంటే చాలా మంచి జరుగుతుంది. దుష్ట శక్తులు రాకుండా చేస్తుంది.

6.కలశం:

సముద్ర మథనం సమయంలో చివర్లో ధన్వంతరి దేవుడు అమృతంతో కూడిన కుండతో ఉద్భవించాడు. దానికి ప్రతీకగా కలశం ఆనందం, శ్రేయస్సు, సంపదను తీసుకువస్తుంది. కలశం నోట్లో విష్ణువు, మెడలో రుద్రుడు, మూలాధారంలో బ్రహ్మ, మధ్యలో శక్తి దేవి నివసిస్తారు అని అంటారు. కలశం పైనకొబ్బరికాయను పెడుతుంటాము. ఆ కలశం విష్ణువు, వరుణ దేవుళ్లను సూచిస్తుంది, కొబ్బరికాయ లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/వాస్తు ప్రకారం ఈ గుర్తులు ఇంటి ముఖద్వారంపై ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.. సానుకూల శక్తి ప్రవహిస్తుంది!
News/Rasi Phalalu/వాస్తు ప్రకారం ఈ గుర్తులు ఇంటి ముఖద్వారంపై ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.. సానుకూల శక్తి ప్రవహిస్తుంది!