భర్త బయటకు వెళ్ళేటప్పుడు, ఈ 4 చిన్న పరిహారాలను పాటిస్తే ఆటంకాలు లేకుండా పనులు పూర్తయిపోతాయి!
మీ భర్త సంతోషంగా ఉండాలన్నా, ధనం, సక్సెస్ రావాలన్నా వారు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వీటిని ఇవ్వండి. ఇక వారికి ఏ సమస్యలు ఉండవు. ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే తొలగిపోతాయి. మరి భర్త అనుకున్న పనులు పూర్తవ్వాలన్నా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్నా ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం వివిధ రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అనుకున్న పని పూర్తి అయిపోతే ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు పదే పదే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది.

మీ భర్త సంతోషంగాఉండాలన్నా, ధనం, సక్సెస్ రావాలన్నా వారు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వీటిని ఇవ్వండి. ఇక వారికి ఏ సమస్యలు ఉండవు. ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే తొలగిపోతాయి. మరి భర్త అనుకున్న పనులు పూర్తవ్వాలన్నా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్నా ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేయండి:
సానుకూల శక్తి కలుగుతుంది:
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని మంచి అలవాట్లను పాటిస్తే సానుకూలశక్తి పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. భర్త చేపట్టిన పనులు పూర్తవుతాయి, విజయాలను అందుకోవచ్చు. పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
1.పాలు – బెల్లం:
పాలు, బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మీ భర్త ఇంటినుంచి బయటకు వెళ్ళేటప్పుడు పాలల్లో బెల్లం కలిపి ఇచ్చేయండి. ఇలా చేయడం వలన ధనం లభిస్తుంది. జీవితంలో మాధుర్యం ఉంటుంది. భర్త సక్సెస్‌ను పొందగలుగుతారు.
2.తియ్యటి పండ్లు తినిపించండి:
అరటి పండ్లు, ఆపిల్ పండ్ల వంటి వాటిని భర్తబయటకు వెళ్ళే ముందు తినిపించండి. విష్ణుమూర్తికి అరటి పండ్లు అంటే ఇష్టం కాబట్టి, వీటిని ఇవ్వడం మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది. శుభఫలితాలు తీసుకొస్తుంది.
3.కాయిన్స్ లేదా డబ్బులు ఇవ్వండి:
భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కాయిన్స్ లేదా కొంత డబ్బు ఇవ్వండి. ఇది మంచి జరిగేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ధనం ప్రవాహం ఏర్పడుతుంది.
4.నుదుటిపై తిలకం పెట్టండి:
భర్త నుదుటిపై తిలకం పెడితే సానుకూలశక్తి ప్రవహిస్తుంది. పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. విజయం వారి వస్తుంది.
పైన చెప్పిన విధంగా పాటించడం వలన, మీ భర్త వారి పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇంట్లో సంతోషం ఉంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం పెరుగుతుంది. గౌరవం, మర్యాదలు, ప్రశాంతత, సంతోషం నిండి ఉంటుంది. ఇలా భర్త బయటకు వెళ్ళేటప్పుడు ఈ చిట్కాలను పాటిస్తే అనేక లాభాలు పొందవచ్చు. సంతోషంగా జీవించొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



