...
...
Next Story

సోమవారం నాడు చంద్ర దోష నివారణకు, శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? ఇలా చేస్తే కష్టాలు తీరినట్టే!

శివుడిని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. సోమవారం శివుడిని ఆరాధించడం వలన ఎన్నో విధాలుగా లాభాలని పొందవచ్చు కూడా. శివుడిని సోమవారం నాడు ఎలా పూజించాలి? వేటిని శివుడికి సమర్పిస్తే మంచిదీ వంటి విషయాలను కూడా ఈ రోజు తెలుసుకుందాం.

Published on: Jun 16, 2025, 07:00:09 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

హిందూ మతంలో శివుడుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శాస్త్రాల ప్రకారం ఎంత కోపంతో శివుడు ఉంటాడో, అంతే దయ కూడా శివుడులో ఉంటుంది. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని మనం ఆరాధిస్తాము. శివుడిని సోమవారం నాడు ఆరాధిస్తాము. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం అడుగు, చాలామంది శివ భక్తులు ఉపవాసం ఉంటారు.

సోమవారం నాడు చంద్ర దోష నివారణకు, శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? (pinterest)
సోమవారం నాడు చంద్ర దోష నివారణకు, శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? (pinterest)

సోమవారంనాడు శివుడిని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. సోమవారం శివుడిని ఆరాధించడం వలన ఎన్నో విధాలుగా లాభాలని పొందవచ్చు కూడా. శివుడిని సోమవారం నాడు ఎలా పూజించాలి? వేటిని శివుడికి సమర్పిస్తే మంచిదీ వంటి విషయాలను కూడా ఈ రోజు తెలుసుకుందాం.

సోమవారం శివుడిని ఆరాధించేటప్పుడు పాటించాల్సిన నియమాలు:

  1. సోమవారం నాడు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి, ఆ తర్వాత శివుడికి నీరు, పాలు సమర్పించాలి. సోమవారం నాడు శివునికిభస్మాభిషేకం చేస్తే కూడా మంచి జరుగుతుంది. ఈ రోజు శివుడితో పాటు పార్వతిని కూడా ఆరాధించాలి.
  2. సోమవారం ఉపవాస దీక్షను మొదలుపెట్టాలి. తెల్లవారుజామున శివయ్యకు పూజలు చేయాలి.
  3. బిల్వపత్రాలు, పూలను కూడా సమర్పించాలి.
  4. చివరగా హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించాలి.
  5. సోమవారం నాడు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసంగా ఉండాలి.
  6. సోమవారం నాడు శివుడిని ఆరాధించి ఉపవాసం చేసినప్పుడు పండ్లు తినకూడదు అనే ఎలాంటి నియమాలు లేవు. మూడు గంటల తర్వాత భోజనం చేయవచ్చు.
  7. చాలామంది మూడు సోమవారాలు లేదా 16 సోమవారాలు ఉపవాసం చేస్తారు. శివ పూజ చేశాక కథ చదువుకోవడం లేదా వినడం చాలా ముఖ్యం. సాయంత్రం శివుడికి పూజ చేసి హారతి ఇవ్వాలి. ఇలా సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

చంద్ర దోష నివారణకు సోమవారం నాడు ఇలా చేయండి:

అదృష్టంకలగాలంటే సోమవారం నాడు పూజ గదిలో క్రిస్టల్ శివలింగాన్ని పెట్టి, పూలు, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. ఆ తర్వాత పంచోపచారాలతో శివుడిని ఆరాధించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks