గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించండి.. పితృ దోషాలు తొలగిపోతాయి, గురు గ్రహం అనుగ్రహం కలుగుతుంది!

ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈసారి జూలై 10న వచ్చింది. గురు పౌర్ణమి నాడు గురువు పట్ల భక్తిని తెలియజేస్తాము. ఈ రోజున గురువును ఆరాధించడం వలన పితృ దోషం, గురు గ్రహం యొక్క చెడు ఫలితాలు తొలగిపోతాయి. గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించడం చాలా మంచిది.

Published on: Jul 02, 2025 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈసారి జూలై 10న వచ్చింది. గురు పౌర్ణమి నాడు గురువు పట్ల భక్తిని తెలియజేస్తాము, వారికి కృతజ్ఞతలు చెబుతాము. సనాతన ధర్మంలో గురువుకు భగవంతునితో సమానమైన హోదా ఉంది.

గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించండి (pinterest)
గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించండి (pinterest)

“గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః.”

ఈ రోజున గురువును ఆరాధించడం వలన పితృ దోషం, గురు గ్రహం యొక్క చెడు ఫలితాలు తొలగిపోతాయి. జ్ఞానం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు.

గురు పౌర్ణమి నాడు ఈ ఐదు పసుపు వస్తువులను గురువుకు ఇవ్వడం మంచిది:

1.పసుపు రంగు దుస్తులు:

పసుపు రంగు దుస్తులను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. ఇది నిజానికి శుభ ఫలితాలను అందిస్తుంది. గురు గ్రహాన్ని సంతోషపెట్టేలా చేస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఇలా పసుపురంగు వస్త్రాలను గురువుకు దానం చేస్తే కెరీర్‌లో సక్సెస్‌ను కూడా పొందవచ్చు.

2.పసుపు రంగు మిఠాయిలు:

పసుపు రంగులో ఉండే స్వీట్లను గురువుకు ఈరోజు ఇవ్వడం మంచిది. అలా చేయడం వలన గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. పితృ దోషాల నుండి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి, సంతోషాన్ని పొందవచ్చు.

3.పసుపు:

గురువుకు పసుపును ఇవ్వడం కూడా శుభప్రదం. పసుపు స్వచ్ఛతకు చిహ్నం. పసుపును గురువుకు ఇవ్వడం వలన అనారోగ్య సమస్యలు, పేదరికం, జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది.

4.పసుపు రంగు పండ్లు:

పసుపు రంగు పండ్లను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. అరటి పండ్లు, మామిడి పండ్లు వంటి వాటిని గురువుకు ఇవ్వడం వలన గురు గ్రహ అనుగ్రహం లభిస్తుంది. తేటలు పెరుగుతాయి, అదృష్టం కూడా వస్తుంది.

5.పసుపు పూలు:

పసుపు రంగులో ఉండే సంపంగి పూలు, చామంతి పూలు వంటి పూలను గురువుకు ఇవ్వండి. వీటిని గురువుకు ఇవ్వడం వలన ఆధ్యాత్మికపురోగతి కలుగుతుంది. మెదడు ప్రశాంతంగా మారుతుంది, గురు గ్రహం అనుగ్రహం పొందవచ్చు.

గురు పౌర్ణమి నాడు ఇలా ఈ ఐదు వస్తువులను గురువుకు ఇవ్వడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, సంతోషంగా ఉండవచ్చు, పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, గురు గ్రహం నుండి శుభ ఫలితాలను పొందవచ్చు, జీవితం సంతోషంగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించండి.. పితృ దోషాలు తొలగిపోతాయి, గురు గ్రహం అనుగ్రహం కలుగుతుంది!
News/Rasi Phalalu/గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించండి.. పితృ దోషాలు తొలగిపోతాయి, గురు గ్రహం అనుగ్రహం కలుగుతుంది!