...
...
Next Story

అదృష్టం వరించాలంటే దేవాలయంలో ఈ 6 దానం చేయండి.. ఇక మీ జీవితం మారిపోయినట్టే!

ఇతరులకు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. హిందూ మతంలో కొన్ని ముఖ్యమైన రోజుల్లో దానం చేయడానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదృష్టం కలగాలన్నా, ఇబ్బందులు తొలగిపోవాలన్నా, వీటిని దానం చేయడం మంచిది. వీటిని దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

Published on: Jul 7, 2025, 15:00:15 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రతి ఒక్కరూ కూడా ఎంత కష్టపడినా, ఎంతో కొంత అదృష్టం కూడా తోడుండాలి. అప్పుడే అనుకున్న వాటిని పూర్తి చేయగలరు, సులువుగా విజయాన్ని అందుకోవచ్చు. ఇతరులకు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. హిందూ మతంలో కొన్ని ముఖ్యమైన రోజుల్లో దానం చేయడానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు, అయితే వాటి నుంచి తక్కువ సమయంలోనే బయటపడతారు.

అదృష్టం వరించాలంటే దేవాలయంలో ఈ 6 దానం చేయండి (pinterest)
అదృష్టం వరించాలంటే దేవాలయంలో ఈ 6 దానం చేయండి (pinterest)

కానీ కొంతమందికి మాత్రం అలా కుదరదు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, అసలు అదృష్టం కూడా వారితో ఉండదు. అలాంటప్పుడు ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దానం ఎంతో పుణ్యం

అదృష్టంకలగాలన్నా, ఇబ్బందులు తొలగిపోవాలన్నా, వీటిని దానం చేయడం మంచిది. వీటిని దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది, డబ్బు కొరత కూడా ఉండదు. ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు. దేవాలయంలో వీటిని దానం చేస్తే, అదృష్టం కలిగి సంతోషంగా ఉండవచ్చు. అదృష్టం కలగాలంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు వీటిని దానం చేయండి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది, సంతోషంగా ఉండొచ్చు.

1.దేవుడి విగ్రహాలు

ఏదైనా ఆలయానికి దేవుడువిగ్రహాలను దానం చేయడం ఎంతో మంచి ఫలితాలను అందిస్తుంది. ఎప్పుడైతే అందరూ దేవుడిని ఆరాధిస్తారో, ఆ సమయంలో ఆ దేవుడి విగ్రహాన్ని దానం చేసిన దాత కూడా ప్రయోజనాలను పొందుతారు.

2.పూజ సామాన్లు

ఏదైనా ఆలయానికి పూజ సామాన్లు దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. రాగి, కంచు, బంగారం లేదా వెండిపూజ సామాగ్రిని ఇవ్వచ్చు. పూజకు సంబంధించిన కొన్ని వస్తువులను గుడిలో దానం చేయడం వలన ఎక్కువ కాలం పాటు ప్రయోజనాలను పొందవచ్చు. ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా డబ్బు కొరత వలన ఇబ్బంది పడరు.

3.ఆలయంలో మొక్కలు నాటడం

పూజకు ఉపయోగించే నెయ్యి, నూనె, బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే కూడా సంతోషంగా ఉండవచ్చు, అదృష్టం కలిసి వస్తుంది. ఇటువంటి వాటిని దానం చేయడం వలన జాతకంలో గురువుస్థానం బలంగా మారుతుంది, సంతోషంగా ఉండొచ్చు.

5.త్రాగు నీరు

త్రాగు నీరు ఏర్పాటు చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. అక్కడికి వచ్చిన భక్తులు ఆ నీరు తాగి సంతోషపడతారు, ఆ పుణ్యమంతా మీకే లభిస్తుంది.

6.దేవుడికి వీటిని సమర్పించండి

దేవుడికి పంచామృతాలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు వంటి వాటిని సమర్పిస్తే మంచిది. ఇలా చేయడం వలన కూడా అదృష్టం కలిసి వస్తుంది, సంతోషంగా ఉండొచ్చు.

7.ఆలయ నిర్మాణానికి కావలసిన సామాగ్రి

ఏదైనా ఆలయానికి, ఆలయ నిర్మాణానికి కావలసిన సిమెంట్, రాళ్లు, టైల్స్ వంటి వాటిని దానం చేయవచ్చు. ఇలా దానం చేస్తే కూడా అదృష్టంకలిసి వస్తుంది, ఎంతో పుణ్యం వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe