మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు.. ఈరోజు ఈ నైవేద్యాలు పెట్టి, సౌందర్యలహరి చదివితే కష్టాలు తీరిపోతాయి!
ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండో రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు మూడో రోజు బుధవారం అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే ఏం అవుతుంది?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు.

ఇంద్రకీలాద్రిపై నవరాత్రిఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండో రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు మూడో రోజు బుధవారం అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ఇన్ని ఫలితాలా?
సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే ఆకలిదప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం...అందుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.
లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. ఈ రోజు అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దధ్యోజనం నివేదిస్తారు.
బిడ్డల ఆకలి తీర్చేందుకు..
ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా తరలిరావడమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. అన్నపూర్ణదేవిని తెలుపు, పసుపు పూలతో పూజించాలి. ఈ రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలతో పాటు ఆది శంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి కూడా చదువుకుంటే శుభ ఫలితాలు పొందుతారని పురాణేతిహాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది
అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో...తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో కనిపించే అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలుఉండవని భక్తుల విశ్వాసం. ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందిస్తుంది అన్నపూర్ణమ్మ. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి.
అమ్మవారు ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఏది లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం.
నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మని దర్శించుకుంటే అన్నాదులకు లోటు ఉండదని చెబుతారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



