ఎండిపోయిన తులసి మొక్కతో ఈ 4 పరిహారాలను పాటిస్తే, మీ సమస్యలన్నీ పరార్.. పేదరికం, దురదృష్టం ఇవేమి ఉండవు
కొన్ని సార్లు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తులసి పరిహారాలు బాగా పనిచేస్తాయి. తులసి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. తులసి మొక్కను ఉదయం, సాయంత్రం పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. ఎండిపోయిన తులసి మొక్కతో ఈ 4 పరిహారాలను పాటిస్తే, మీ సమస్యలన్నీతొలగిపోతాయి.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం వివిధ రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. తులసి మొక్క ఏ ఇంట్లోఅయితే ఉంటుందో, ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం, వాస్తు ప్రకారం తులసి మొక్కకు ప్రత్యేక ప్రార్థననేతనే ఇవ్వబడుతుంది.

కొన్ని కొన్ని సార్లు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తులసి పరిహారాలు బాగా పనిచేస్తాయి. తులసిపరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. తులసి మొక్కను ఉదయం, సాయంత్రం పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.
ఎండిపోయిన తులసి మొక్క:
తులసి మొక్క ఎండిపోవడం అనేది మంచిది కాదు. ఇది చెడుఫలితాలను ఇస్తుంది. తులసి మొక్క ఎండిపోతే దానిని ఇంటి నుంచి తొలగించాలి. మరో తులసి మొక్కను నాటాలి. అయితే, ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉండడం మంచిది కానప్పటికీ, ఇది చాలా శక్తివంతమైనది. కొన్ని పరిహారాలను ఎండిపోయిన తులసి మొక్కతో చేయడం వల్ల సంతోషంగా ఉండొచ్చు.
1. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం:
విష్ణుమూర్తిఅనుగ్రహం కలగడానికి ఎండిపోయిన తులసి మొక్క కొమ్మలను ఏడు తీసుకుని ఒక దారంతో కట్టి, నేతిలో వేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తి ఎదుట పెట్టి వెలిగించాలి. ఇలా చేయడం వలన అదృష్టాన్ని పొందవచ్చు. ఇప్పటి నుంచి అదృష్టం కలగక సతమతమయ్యే వారు ఈ పరిహారాన్ని పాటిస్తే, అదృష్టం కలిగి సంతోషంగా ఉండవచ్చు.
2.ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే:
ఎండిపోయిన తులసి ఆకులను గంగాజలంలో వేసి, ఆ నీటిని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం వలన ప్రతికూలశక్తి తొలగిపోతుంది.
3.ఆర్థిక ఇబ్బందుల నివారణకు:
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే, ఎండిపోయిన తులసి కొమ్మలను చిన్న ముక్కలుగా చేసి, దారం చుట్టి గురువారం నాడు పూజలో ఉపయోగించండి. పూజతర్వాత వీటిని తీసి ఎర్రటి వస్త్రంలో చుట్టి పర్సులో ఉంచండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
4.సానుకూల శక్తి కలగడానికి:
ప్రతికూలశక్తి వలన ఇబ్బంది పడుతున్నట్లయితే, తులసి వేరుని కడిగేసి, ఎర్రటి క్లాత్‌లో చుట్టి ఇంటి ముందు తగిలించండి. ఇలా చేయడం వలన ఇంటి నుంచి ప్రతికూల శక్తి పోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇలా సులభంగా ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



